Siddaramaiah Target: మంత్రులకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య టార్గెట్‌

ABN , First Publish Date - 2023-05-28T22:31:32+05:30 IST

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతన కేబినెట్ సహచరులందరికీ టార్గెట్‌లను ఫిక్స్ చేశారు. ఏడాదిలోగా లోక్‌సభ ఎన్నికలు రానున్నాయని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, సీనియర్లు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలకు కానుకగా లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లను సాధించేదిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. శనివారం 24 మంది కొత్త మంత్రులను చేర్చుకోవడం ద్వారా తన మంత్రివర్గంలోని మొత్తం 34 స్థానాలను భర్తీ చేశారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కేబినెట్ సహచరులకు దిశానిర్దేశం చేశారు.

Siddaramaiah Target: మంత్రులకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య టార్గెట్‌

బెంగళూరు: కర్ణాటక(Karnataka) సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah) తన కేబినెట్ సహచరులందరికీ టార్గెట్‌లను ఫిక్స్ చేశారు. ఏడాదిలోగా లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) రానున్నాయని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే( Congress President Mallikarjun Kharge), సీనియర్లు సోనియా గాంధీ(Sonia Gandhi), రాహుల్‌ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)లకు కానుకగా లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లను సాధించేదిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. శనివారం 24 మంది కొత్త మంత్రులను చేర్చుకోవడం ద్వారా తన మంత్రివర్గంలోని మొత్తం 34 స్థానాలను భర్తీ చేశారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కేబినెట్ సహచరులకు దిశానిర్దేశం చేశారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా నిబద్ధత, నిజాయితీ, చురుకుదనంతో తమ బాధ్యతలను నిర్వర్తించాలని మంత్రులకు సీఎం సిద్ధరామయ్య సూచించారు. తాము ఇచ్చిన హామీలు ప్రజలకు చేరేలా చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. గతంలో జరిగిన పొరపాట్లు ఈసారి పునరావృతం కాకూడదని స్పష్టం చేశారు.

త్వరలో పోర్ట్‌ఫోలియో కేటాయింపు పూర్తవుతుందని మంత్రులకు హామీ ఇచ్చిన సిద్ధరామయ్య.. ‘‘మీరంతా చురుగ్గా పని చేయాలి.మన పోరాటం ఫలితంగానే బీజేపీ దుష్టపాలనను చరమగీతం పాడామన్నారు. అదే స్ఫూర్తితో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 20 సీట్లు సాధించేదిశగా కృషి చేయాలని తెలిపారు.

‘రాష్ట్ర ప్రజలు మనకు అపూర్వమైన మెజారిటీతో పాటు మహోన్నతమైన బాధ్యతను కూడా ఇచ్చారని, దానికి అనుగుణంగా ప్రజానుకూల పాలన అందించడం మన బాధ్యత అని గుర్తు చేశారు. ప్రజాసమస్యలు విని వాటిపై స్పందిస్తూ స్థానికంగా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. చిన్నా పెద్ద అని తేడాలేకుండా అన్ని పనులు సత్వరమే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాసమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరిస్తూ ప్రజలు సచివాలయానికి వచ్చే పరిస్థితి లేకుండా కృషి చేయాలని కోరారు. ప్రజానుకూలమైన కృషి చేస్తూ లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ అపూర్వ విజయాన్ని నమోదు చేయాలని మంత్రులకు సూచించారు.

కర్నాటక ద్వారా కేంద్రంలోని దుష్పరిపాలనకు ముగింపు పలికే రోజులు దగ్గరలోనే ఉన్నాయని సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఈ విషయాన్ని మనం మరచిపోకుండా తమ జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి, జిల్లా, తాలూకా స్థాయిలో సమస్యలు పరిష్కరించాలని సీఎం సిద్ధరామయ్య అన్నారు.

Updated Date - 2023-05-28T22:31:32+05:30 IST