Kannada actor: జంటను కారుతో ఢీకొన్న కన్నడ నటుడు, మహిళ మృతి

ABN , First Publish Date - 2023-10-01T14:37:03+05:30 IST

కన్నడ నటుడు నాగభూషణ కర్ణాటకలోని బెంగళూరులో కారును వేగంగా నడుపుతూ ఫుట్‌పాత్‌పై ఉన్న జంటను ఢీకొనడంతో మహిళ మృతి చెందింది. శనివారం రాత్రి 9.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆయన కారు తొలుత విద్యుత్ స్తంభాన్ని ఢీకొని వసంతనగర్ మెయిన్ రోడ్డుకు సమీపంలో వాకింగ్‌ చేస్తున్న జంటను ఢీకొంది.

Kannada actor: జంటను కారుతో ఢీకొన్న కన్నడ నటుడు, మహిళ మృతి

బెంగళూరు: కన్నడ నటుడు (Kannada Actor) నాగభూషణ (Nagabhushana) కర్ణాటకలోని బెంగళూరులో కారును వేగంగా నడుపుతూ ఫుట్‌పాత్‌పై ఉన్న జంటను ఢీకొనడంతో మహిళ మృతి చెందింది. శనివారం రాత్రి 9.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆయన కారు తొలుత విద్యుత్ స్తంభాన్ని ఢీకొని వసంతనగర్ మెయిన్ రోడ్డుకు సమీపంలో వాకింగ్‌ చేస్తున్న జంటను ఢీకొంది. ఉత్తరహళ్లి నుంచి కొననకుంటె వైపు ఆయన ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.


ప్రమాదంలో గాయపడిన జంటను నాగభూషణ్ వెంటనే ఆసుపత్రిలో చేర్చించగా, 48 ఏళ్ల మహిళ చికిత్స పొందుతూ మరణించింది. కాళ్లు, తల, పొట్టపై బలమైన గాయాలైన ఆమె భర్త ప్రస్తుతం ఫోర్టిస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నాగభూషణ్‌పై కుమారస్వామి ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వేగంగా కారు నడిపినట్టు ఎఫ్ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. మద్యం తాగి కారును నడిపారా అనేది నిర్ధారించేందుకు రక్తం సాంపుల్స్ తీసుకుని ల్యాబ్ టెస్ట్‌కు పంపించామని, బ్రీత్ అనజైలర్ ప్రకారం ఆయన మద్యం తీసుకున్నట్టు నిర్ధారణ కాలేదని ట్రాఫిక్ సౌత్ డీసీపీ శివప్రకాష్ తెలిపారు. ఈ కేసులో ఆయనకు బెయిలు లభించింది.


నాగభూషణ ఇటీవల 'కౌసల్య సుప్రజ రామ' చిత్రంలో నిటించారు. 'ఇక్కత్' అనే చిత్రంతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన ఉత్తమ నూతన నటుడు అవార్డును అందుకున్నారు. 'బడవ రాస్కేల్' చిత్రంలో ఉత్తన సపోర్టింగ్ నటుడిగా నామినేట్ అయ్యాడు.

Updated Date - 2023-10-01T14:37:03+05:30 IST