Indian Air Force : కర్ణాటకలో కూలిపోయిన వాయు సేన శిక్షణ విమానం.. పైలట్లు సురక్షితం..

ABN , First Publish Date - 2023-06-01T15:09:31+05:30 IST

కర్ణాటకలోని చామరాజ నగర్ జిల్లాలో గురువారం దారుణం జరిగింది. భారత వాయు సేన కు చెందిన సూర్య కిరణ్ శిక్షణ విమానం కూలిపోయింది.

Indian Air Force : కర్ణాటకలో కూలిపోయిన వాయు సేన శిక్షణ విమానం.. పైలట్లు సురక్షితం..

బెంగళూరు : కర్ణాటకలోని చామరాజ నగర్ జిల్లాలో గురువారం దారుణం జరిగింది. భారత వాయు సేన (Indian Air Force)కు చెందిన సూర్య కిరణ్ శిక్షణ విమానం కూలిపోయింది. రోజువారీ శిక్షణలో భాగంగా ప్రయాణిస్తున్న ఈ విమానం బోగపుర గ్రామం సమీపంలో కూలిపోయింది. అయితే దీనిలోని ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. ప్రజలు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి వచ్చారు.

భారత వాయు సేన అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, విమానం కూలిపోవడానికి ముందే ఇద్దరు పైలట్లు ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. వీరిలో ఒకరు మహిళా పైలట్. ఈ ప్రమాదానికి కారణాలేమిటో తెలుసుకునేందుకు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించారు. రొటీన్ ట్రైనింగ్ సార్టీలో భాగంగా ఈ విమానం ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ విమానాన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసింది. ఇది 1964లో మొదటిసారి ప్రయాణించింది. దీనిని పైలట్లకు స్టేజ్ 2 శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగిస్తున్నారు.

రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో భారత వాయు సేన విమానం మిగ్-21 ఫైటర్ జెట్ గత నెలలో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సోవియెట్ యూనియన్ నుంచి కొనుగోలు చేసిన మిగ్ విమానాలు పాతబడిపోయాయి. అందువల్ల వీటిని ఇకపై ఉపయోగించరాదని వాయు సేన నిర్ణయించింది. వీటిని మన దేశానికి తీసుకొచ్చినప్పటి నుంచి 400కుపైగా ప్రమాదాలు జరిగాయి.

ఇవి కూడా చదవండి :

Chanchalguda Jail: చంచల్‌గూడ గేట్‌.. తాడేపల్లిలో రిమోట్‌

Gujarat : సముద్రంలో మునిగిపోతున్న ముగ్గుర్ని కాపాడిన బీజేపీ ఎమ్మెల్యే

Updated Date - 2023-06-01T15:16:52+05:30 IST