Gyanvapi case: హిందూ మత ఆధారాలు ఇవ్వండి.. ఏఎస్ఐని ఆదేశించిన వారణాసి కోర్టు

ABN , First Publish Date - 2023-09-14T15:52:55+05:30 IST

ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రం వారనాసిలోని జ్ఞాన్‌వాపి మసీదులో కొనసాగుతున్న సర్వేలో కనుగొన్న హిందూ(Hindu) మతానికి సంబంధించిన అన్ని ఆధారాలను జిల్లా మేజిస్ట్రేట్‌కు(District Majistrate) అప్పగించాలని వారణాసి(Varanasi) కోర్టు బుధవారం ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)ని ఆదేశించింది.

Gyanvapi case: హిందూ మత ఆధారాలు ఇవ్వండి.. ఏఎస్ఐని ఆదేశించిన వారణాసి కోర్టు

ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రం వారనాసిలోని జ్ఞాన్‌వాపి మసీదులో కొనసాగుతున్న సర్వేలో కనుగొన్న హిందూ(Hindu) మతానికి సంబంధించిన అన్ని ఆధారాలను జిల్లా మేజిస్ట్రేట్‌కు(District Majistrate) అప్పగించాలని వారణాసి(Varanasi) కోర్టు బుధవారం ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)ని ఆదేశించింది. జిల్లా న్యాయస్థానం సూచించిన వ్యక్తి ఆ వస్తువులను భద్రపరచాలని, అవసరమైనప్పుడు వాటిని కోర్టుకు అందించాలని చెప్పింది. “ఈ కేసుకు సంబంధించి హిందూ మతానికి సంబంధించి ఏ చిన్న వస్తువు దొరికినా దాన్ని కోర్టుకు అందజేయాలి. జిల్లా మేజిస్ట్రేట్‌కు లేదా వారు నామినేట్ చేసిన అధికారి ఆ వస్తువులను భద్రంగా దాచాలి" అని ధర్మాసనం పేర్కొంది.


జ్ఞాన్‌వాపి మసీదు(Gnanavapi Masjid) ఆవరణలో ఉన్న ఆలయాన్ని(Temple) పునరుద్ధరించాలని దాఖలైన వ్యాజ్యం చెల్లుబాటును ప్రశ్నిస్తూ వేసిన పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టులో విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ASI.. కాశీ విశ్వనాథ ఆలయానికి ఆనుకుని ఉన్న జ్ఞాన్ వాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వేను నిర్వహిస్తోంది. ఆ మసీదు నిర్మాణం హిందూ దేవాలయంపై జరిగిందా లేదా అనేది ఈ సర్వే ముఖ్య ఉద్దేశం. వారణాసి జిల్లా కోర్టు ఆదేశాలను సమర్థిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి ఈ సర్వే ప్రారంభమయింది. రెండు వర్గాల మధ్య ఈ వివాదం ఏళ్లుగా నడుస్తూనే ఉంది. సెప్టెంబర్ 8న, వారణాసి కోర్టు జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలోని శాస్త్రీయ సర్వేను పూర్తి చేసి దాని నివేదికను సమర్పించడానికి ASIకి మరో నాలుగు వారాల గడువు ఇచ్చింది .

Updated Date - 2023-09-14T15:53:19+05:30 IST