Gali Janardhana Reddy: యడియూరప్పను గాలి జనార్ధనరెడ్డి ఏమన్నారో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-02-28T12:59:08+05:30 IST

మాజీ సీఎం యడియూరప్పను తండ్రిలా గౌరవిస్తానని కల్యాణ రాజ్య ప్రగతిపక్ష వ్యవస్థాపకుడు గాలి జనార్ధన రెడ్డి(Gali Janardhana Reddy)

Gali Janardhana Reddy: యడియూరప్పను గాలి జనార్ధనరెడ్డి ఏమన్నారో తెలిస్తే..

బెంగళూరు: మాజీ సీఎం యడియూరప్పను తండ్రిలా గౌరవిస్తానని కల్యాణ రాజ్య ప్రగతిపక్ష వ్యవస్థాపకుడు గాలి జనార్ధన రెడ్డి(Gali Janardhana Reddy) పేర్కొన్నారు. తుమకూరు జిల్లా పావగడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సొంత పార్టీ ద్వారా వచ్చే ఎన్నికల్లో తలపడుతున్నానని అయినంత మాత్రాన యడియూరప్ప పేరును రాజకీయంగా దుర్వినియోగం చేయనని స్పష్టం చేశారు. ఉత్తర కర్ణాటక ప్రాంతంపైనే మా పార్టీ దృష్టి సారించిందని, 31 నియోజకవర్గాలలో శక్తివంతం అవుతోందన్నారు. నమ్మకం, విశ్వాసంతో స్వాగతిస్తున్నారన్నారు. పావగడ నుంచి నాగేంద్ర కుమార్‌(Nagendra Kumar) పోటీ చేసేందుకు సిద్ధమయ్యారని ఇప్పటికే రెండు సర్వేలు చేయించామన్నారు. పార్టీలో చేరేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారన్నారు. 9 మంది అభ్యర్థులను ప్రకటించామని రానున్న రోజుల్లో మరింత మంది జాబితా విడుదల చేస్తామన్నారు.

Updated Date - 2023-02-28T12:59:08+05:30 IST