Share News

Former CM: మండిపడ్డ మాజీసీఎం కుమారస్వామి.. సిద్దరామయ్యది సంకుచిత స్వభావం

ABN , Publish Date - Dec 31 , 2023 | 12:57 PM

ఐఎన్‌డీఐఏ (ఇండియా) కూటమి తరపున మల్లికార్జునఖర్గేను ప్రధానిని చే యాలని పలు పార్టీల నేతలు ప్రస్తావిస్తుంటే ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాత్రం రాహుల్‌గాంధీ కావాలని వ్యాఖ్యానించడం ఆయన సంకుచిత స్వభావానికి నిదర్శనమని జేడీఎస్‌ నేత, మాజీ సీఎం కుమారస్వామి(JDS leader and former CM Kumaraswamy) మండిపడ్డారు.

Former CM: మండిపడ్డ మాజీసీఎం కుమారస్వామి.. సిద్దరామయ్యది సంకుచిత స్వభావం

- ఖర్గే బదులు రాహుల్‌ ప్రధాని కావాలనడం తగదు

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ఐఎన్‌డీఐఏ (ఇండియా) కూటమి తరపున మల్లికార్జునఖర్గేను ప్రధానిని చే యాలని పలు పార్టీల నేతలు ప్రస్తావిస్తుంటే ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాత్రం రాహుల్‌గాంధీ కావాలని వ్యాఖ్యానించడం ఆయన సంకుచిత స్వభావానికి నిదర్శనమని జేడీఎస్‌ నేత, మాజీ సీఎం కుమారస్వామి(JDS leader and former CM Kumaraswamy) మండిపడ్డారు. శనివారం బెంగళూరు పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దళిత సమాజానికి చెందిన వారు దీనిని పరిశీలించాలన్నారు. పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తదితరులు ఖర్గే ప్రధాని కావాలని కోరారని తెలిపారు. అహింద పేరుతో అధికారంలో కూర్చున్న సిద్దరామయ్య మాత్రం రాహుల్‌గాంధీ పీఎం కావాలనడాన్ని ఏమని అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. కన్నడిగుడు ప్రధాని కావడం సంతోషమేనని, కానీ అటువంటి పరిస్థితి లేదని కొట్టిపారేశారు. అధికారంలోకి వచ్చి ఏడునెలలయినా కాంతరాజు నివేదికను ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. తానే ఆర్థిక నిపుణుడినని, 14 సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టాననే సీఎం సిద్దరామయ్య ఆర్థిక సలహాదారులను ఎందుకు నియమించుకున్నారని అన్నారు. రాష్ట్రంలో గ్యారెంటీల భజన తప్ప ఏ విభాగంలోను ప్రగతి లేదన్నారు. కరువు విలయతాండవం చేస్తుంటే తాగునీరు, పశుగ్రాసం కోసం రూ.900 కోట్లు మినహా ఏవిధమైన కేటాయింపులు లేవని విమర్శించారు. వారంరోజుల్లో రైతులకు రూ.రెండువేల నగదు బదిలీ చేస్తామని చెప్పి నెలరోజులు ముగిసినా పట్టించుకోలేదన్నారు. ఖజానాలో నిధులు లేవని, పాఠశాలల్లో మరుగుదొడ్లను విద్యార్థులు శుభ్రం చేయడాన్ని ఏమని అర్థం చేసుకోవాలన్నారు. ఉపాధ్యాయులను బలి చేస్తున్నారని మండిపడ్డారు.

Updated Date - Dec 31 , 2023 | 12:57 PM