Indian Students:కెనడాలో జాగ్రత్తగా ఉండాలని భారత విద్యార్థులకు హెచ్చరిక

ABN , First Publish Date - 2023-09-20T15:57:40+05:30 IST

కెనడా(Canada)లో పెరుగుతున్న భారత వ్యతిరేక కార్యకలాపాలు, హింసాకాండను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా ఉండాలని భారత(India) ప్రభుత్వం బుధవారం కెనడాలోని భారతీయ పౌరులు, విద్యార్థులకు హెచ్చరించింది.

Indian Students:కెనడాలో జాగ్రత్తగా ఉండాలని భారత విద్యార్థులకు హెచ్చరిక

ఢిల్లీ: కెనడా(Canada)లో పెరుగుతున్న భారత వ్యతిరేక కార్యకలాపాలు, హింసాకాండను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా ఉండాలని భారత(India) ప్రభుత్వం బుధవారం కెనడాలోని భారతీయ పౌరులు, విద్యార్థులకు హెచ్చరించింది. ఖలిస్తానీ(Khalisthan) ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Justin Trudo) చేసిన ఆరోపణల నుండి ఇరు దేశాల మధ్య వివాదం తలెత్తింది. కెనడా ప్రధాని భారత్ గురించి ఆ దేశ పార్లమెంటులో చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి.


ఇరు దేశాల దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత రాయబారి(Ambassador of India)పై కెనడా నిషేధం విధించగా.. దానికి బదులుగా కెనడా రాయబారిని భారత్ బహిష్కరించింది. దీంతో పరిస్థితి మరింత దిగజారింది. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్(Jai Shankar).. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్ కెనడాల మధ్య ప్రస్తుత పరిస్థితుల గురించి చర్చించేందుకే ప్రధాని, విదేశాంగ శాఖ మంత్రి భేటీ అయినట్లు తెలుస్తోంది. కెనడాలో గడ్డపై ఖలిస్తానీ ఉగ్రవాదిని హతమార్చడంపై కెనడాతో కొనసాగుతున్న దౌత్యపరమైన వివాదం మధ్య, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ప్రస్తుతం కెనడా అనుసరిస్తున్న తీరు.. ప్రపంచ దేశాల మద్దతు ఎలా కూడగట్టాలనే విషయాలతో పాటు పలు కీలకమైన అంశాలపై వారిరువురు చర్చించారు. ఇదే సమయంలో ఆ దేశంలో ఉంటున్న భారత పౌరులు, స్టూడెంట్స్‌ని ప్రభుత్వం హెచ్చరించింది.

Updated Date - 2023-09-20T15:57:40+05:30 IST