Delhi budget : ఢిల్లీ బడ్జెట్‌కు కేంద్రం ఆమోదం

ABN , First Publish Date - 2023-03-21T15:03:26+05:30 IST

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌కు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ

Delhi budget : ఢిల్లీ బడ్జెట్‌కు కేంద్రం ఆమోదం
Delhi state assembly

న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌కు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ బడ్జెట్‌ను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా (Delhi Lieutenant Governor VK Saxena) పరిశీలించిన తర్వాత తనకు మళ్లీ సమర్పించాలని అంతకుముందు ఎంహెచ్ఏ కోరిన సంగతి తెలిసిందే.

ఢిల్లీ శాసన సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు బడ్జెట్‌ను ఆమోదించకుండా కేంద్ర ప్రభుత్వం ఆపేసిందని కేజ్రీవాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అనంతరం ఎంహెచ్ఏ సోమవారం స్పందిస్తూ, ప్రతిపాదిత బడ్జెట్‌పై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కొన్ని పరిపాలనపరమైన అంశాలను లేవనెత్తారని తెలిపింది. దేశ రాజధాని నగరం ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ అంశాలను లేవనెత్తారని పేర్కొంది. ఈ అంశాలను పరిష్కరించి బడ్జెట్‌ను తిరిగి పంపించాలని మార్చి 17న రాసిన లేఖలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు పేర్కొంది.

కేజ్రీవాల్ మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)కి రాసిన లేఖలో రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదం తెలపకుండా నిలిపివేయవద్దని కోరారు. 75 ఏళ్ళ స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఓ రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదం తెలపకపోవడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. ‘‘మా ఢిల్లీ ప్రజలపై మీకెందుకంత కోపం?’’ అని ప్రశ్నించారు. ‘‘ఈ బడ్జెట్‌ను ఆమోదించాలని ఢిల్లీ ప్రజలు చేతులెత్తి మొక్కుతున్నారు’’ అని పేర్కొన్నారు.

షెడ్యూలు ప్రకారం ఢిల్లీ రాష్ట్ర బడ్జెట్‌ను శాసన సభలో మంగళవారం ప్రవేశపెట్టవలసి ఉంది.

ఇవి కూడా చదవండి :

2024 Lok Sabha Polls : బీజేపీని ఓడించడం అసాధ్యం, అయితే ... : ప్రశాంత్ కిశోర్

Amazon : అమెజాన్‌లో ఉద్యోగాల కోత... మరో 9,000 మంది ఉద్యోగులు ఇంటికే...

Updated Date - 2023-03-21T15:03:26+05:30 IST