3 Idiots Scene: 3 ఇడియట్స్ సీన్ రిపీట్ చేశారు.. పోలీసులు దిమ్మతిరిగే షాకిచ్చారు

ABN , First Publish Date - 2023-07-26T22:04:52+05:30 IST

సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం చిత్రివిచిత్రమైన పనులు చేయడంలో తప్పు లేదు. ఇప్పుడు చాలామంది అలాంటి విచిత్ర పనులు చేసే బాగా ఫేమస్ అవుతున్నారు కూడా! కానీ..

3 Idiots Scene: 3 ఇడియట్స్ సీన్ రిపీట్ చేశారు.. పోలీసులు దిమ్మతిరిగే షాకిచ్చారు

సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం చిత్రివిచిత్రమైన పనులు చేయడంలో తప్పు లేదు. ఇప్పుడు చాలామంది అలాంటి విచిత్ర పనులు చేసే బాగా ఫేమస్ అవుతున్నారు కూడా! కానీ.. కొందరు మాత్రం ఒక మెట్టు ఎక్కి, భయంకరమైన స్టంట్లు చేస్తుంటారు. ఎత్తైన ప్రాంతాల వద్దకు వెళ్లి వీడియోలు తీయడమో, బైక్‌లపై స్టంట్లు చేస్తూ పోజులివ్వడమో లాంటి ప్రమాదకరమైన పనులకు పాల్పడుతుంటారు. ఇలాంటి స్టంట్స్ కారణంగా కొందరు ప్రాణాలు కోల్పోయినా, ఇతర ప్రమాదాలు చోటు చేసుకున్నా.. జనాల్లో మార్పు మాత్రం రావడం లేదు. తాము బాగా చేయగలమన్న నమ్మకంతో తెగించేస్తున్నారు. ఇలాంటప్పుడు పోలీసు బాసులు ఊరికే ఉంటారా? వాళ్లు చేసే పనులకు తగినట్టుగానే మొట్టికాయలు వేస్తుంటారు. ఇప్పుడు తాజాగా అలాంటి సంఘటనే ఒకటి వెలుగు చూసింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

హిందీలో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన 3 ఇడియట్స్ సినిమాలో బైక్ సీన్ గుర్తుందా? అదేనండి.. శర్మన్ జోషి ఆత్మహత్యాయత్నం చేసుకుంటే.. స్నేహితులైన ఆమిర్ ఖాన్, మాధవన్ కలిసి అతడ్ని స్కూటీపై ఎక్కించుకొని ఆసుపత్రికి వెళ్తారు. బ్యాక్‌గ్రౌండ్‌లో ‘జానే నహీ, దెంగే తుఝే’ అనే పాట కూడా ప్లే అవుతుంటుంది. సరిగ్గా ఆ సన్నివేశాన్నే ముగ్గురు కలిసి రిపీట్ చేశారు. ఈ వీడియోలో.. అబ్బాయి బైక్ నడుపుతుండగా, వెనకాల ఇద్దరు మహిళలు కూర్చొని ఉంటారు. అసలు ముగ్గురు బైక్‌పై సవారీ చేయడమే ప్రమాదం అనుకుంటే.. ఆ ముగ్గురిలో ఏ ఒక్కరూ హెల్మెట్ కూడా ధరించలేదు. ఈ వీడియోని ఢిల్లీ పోలీసులు షేర్ చేస్తూ.. కేవలం రీల్స్ కోసం ఇలాంటి భయంకరంగా బైక్‌లో సవారీ చేయడం ఏమాత్రం సురక్షితం కాదని ట్వీట్ చేశారు. అలాగే.. వీడియో చివర్లో వీరికి చలాన్ వేస్తూ, ‘జానే తుఝే దెంగే నహీ బినా చలాన్’ (చలాన్ లేకుండా నిన్ను వెళ్లనివ్వము) అంటూ పాట రూపంలో సెటైరికల్‌గా రొసుకొచ్చారు. రోడ్లపై ఇడియట్స్‌లా డ్రైవ్ చేయొద్దు, బాధ్యతాయుతంగా ఉండండని కూడా సూచించారు.


ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో ద్వారా వాహనదారులకి పోలీసులు మంచి సందేహం ఇవ్వడంతో.. పోలీసుల్ని కొనియాడుతూ కామెంట్లు చేస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది.. ఓ నెటిజన్ సంధించిన ప్రశ్నే అయోమయంలో పడేసింది. ‘‘ఒకవేళ అత్యవసర (ఎమెర్జెన్సీ) సమయంలో ఆంబులెన్స్ అందుబాటులో లేనప్పుడు, ఇతర వాహనాలు కూడా దొరకని పక్షంలో.. ట్రిపుల్ రైడింగ్‌కి అనుమతి ఉంటుందా?’’ అని అడిగాడు. అందుకు మరో నెటిజన్ బదులిస్తూ.. నిజంగా అత్యవసర పరిస్థితుల్లో ట్రిపుల్ రైడింగ్ ఆమోదయోగ్యమే కానీ, దాన్ని దుర్వినియోగం మాత్రం చేసుకోకూడదని సూచించాడు.

Updated Date - 2023-07-26T22:04:52+05:30 IST