Delhi Liquor Scam: మాగుంట రాఘవ జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు

ABN , First Publish Date - 2023-03-04T14:53:22+05:30 IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాగుంట రాఘవ రెడ్డి జ్యూడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టు పొడిగించింది.

Delhi Liquor Scam: మాగుంట రాఘవ జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ (Delhi Liquor Scam)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన మాగుంట రాఘవ రెడ్డి (Magunta Raghava Reddy) జ్యూడిషియల్ కస్టడీ (Judicial Custody)ని రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టు (Rouse Avenue CBI Court) పొడిగించింది. మరో 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అంతకుముందు మాగుంటను అధికారులు కోర్టులో హాజరుపరిచ్చారు. రాఘవరెడ్డి తండ్రి ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి (MP Magunta Srinivas Reddy) కూడా కోర్టుకు వచ్చారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని మాగుంట రాఘవ జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని కోర్టును ఈడీ (ED) కోరింది. ప్రస్తుతం మాగుంట తీహార్ జైలు (Tihar Jail)లో ఉన్నారు. మార్చి 13న మాగుంట రాఘవ బెయిల్ పిటిషన్‌ను రౌస్ అవెన్యూ కోర్టు విచారించనుంది. ఈ కేసుకు సంబంధించి ఫిబ్రవరి 10న మాగుంట రాఘవరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

మరోవైపు ఈ కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Delhi Deputy Chief Minister Manish Sisodia)ను కూడా అరెస్ట్ చేసి ఐదు రోజుల పాటు కస్టడీలో ఉంచారు. నేటితో కస్టడీ ముగియనున్న నేపథ్యంలో ఆయనను కోర్టులో హాజరుపర్చనున్నారు. మనీష్‌ సిసోడియాకు సంబంధించిన బెయిల్ పిటిషన్‌‌పై కూడా ఈరోజు విచారణ జరుగనుంది. దర్యాప్తు సంస్థలు పిలిచినప్పుడల్లా విచారణలో పాల్గొన్నానని, ఈ కేసులో ఇతర నిందితులకు కూడా బెయిల్ లభించిందని, తనని కస్టడీలో ఉంచడం వల్ల సాధించేది ఏదీ లేదని మనీష్‌ సిసోడియా అన్నారు. ఇప్పటికే ఈ కేసులో రికవరీ అంతా జరిగిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజ్యంగబద్ధమైన పదవిలో ఉన్నానని, ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగించాల్సిన బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయని పిటిషన్‌లో తెలిపారు. దీనిపై మరికొద్దిసేపట్లో విచారణ జరుగనుంది.

Updated Date - 2023-03-04T15:24:34+05:30 IST