Delhi liquor policy : సీబీఐకి మనీశ్ సిసోడియా లేఖ

ABN , First Publish Date - 2023-02-19T09:44:15+05:30 IST

ఢిల్లీ మద్యం పాలసీ కేసు (Delhi liquor policy case)లో తనను ప్రశ్నించడాన్ని వాయిదా వేయాలని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా

Delhi liquor policy : సీబీఐకి మనీశ్ సిసోడియా లేఖ
Manish Sisodia

న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం పాలసీ కేసు (Delhi liquor policy case)లో తనను ప్రశ్నించడాన్ని వాయిదా వేయాలని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia) సీబీఐ (Central Bureau of Investigation)కి లేఖ రాశారు. తాను ఢిల్లీ బడ్జెట్‌ కోసం ప్రస్తుతం పని చేస్తున్నానని, విచారణను కనీసం ఓ వారం వాయిదా వేయాలని కోరారు.

మనీశ్ సిసోడియాను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, ఫిబ్రవరి నెలాఖరులో ఎప్పుడైనా తాను సీబీఐ కార్యాలయానికి వెళ్ళి, విచారణకు సహకరిస్తానని సిసోడియా చెప్పారు. ఫిబ్రవరి నెలాఖరులో సీబీఐ తనను ఎప్పుడు పిలిచినా తాను హాజరవుతానన్నారు. తాను ఢిల్లీ రాష్ట్ర ఆర్థిక మంత్రినని, అందువల్ల బడ్జెట్‌ను తయారు చేయడం చాలా ముఖ్యమని చెప్పారు. విచారణ తేదీని వాయిదా వేయాలని సీబీఐని కోరినట్లు తెలిపారు. ఈ సంస్థలకు తాను ఎల్లప్పుడూ సహకరిస్తున్నానని తెలిపారు.

ఇదిలావుండగా, సిసోడియా కోరినట్లుగా విచారణను వాయిదా వేసేందుకు సీబీఐ సానుకూలంగా స్పందించకపోవచ్చునని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి.

ఇవి కూడా చదవండి :

#RIPTarakaRatna TarakaRatna Live Updates: తారకరత్న కుమార్తెను ఈ స్థితిలో చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోవాల్సిందే..

East Godavari: చంద్రబాబు భద్రతపై ఎన్‌ఎస్‌జీ అప్రమత్తం

Updated Date - 2023-02-19T09:44:19+05:30 IST