Karnataka Assembly Polls:సిద్ధరామయ్యపై పరువు నష్టం కేసు

ABN , First Publish Date - 2023-04-26T11:16:01+05:30 IST

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో పరువునష్టం కేసులకు బీజేపీ శ్రీకారం చుట్టింది....

Karnataka Assembly Polls:సిద్ధరామయ్యపై పరువు నష్టం కేసు
Siddaramaiah

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో పరువునష్టం కేసులకు బీజేపీ శ్రీకారం చుట్టింది. అవినీతి లింగాయత్ సీఎంలంటూ చేసిన వ్యాఖ్యలకు గాను సిద్ధరామయ్యపై పరువు నష్టం కేసు దాఖలైంది.సిద్ధరామయ్యపై మంగళవారం బెంగళూరులోని మేజిస్ట్రేట్ కోర్టులో బీజేపీ కార్యకర్త శంకర్ సైత్ పరువునష్టం దావా వేశారు.కర్ణాటకలో ఎన్నికల వేళ హైవోల్టేజ్‌తో ఎన్నికల ప్రచారం సాగుతోంది.శంకర్ సైత్ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఏప్రిల్ 29కి వాయిదా వేసింది.ఈ విషయమై ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు కూడా కాంగ్రెస్‌ నేతపై బీజేపీ ఫిర్యాదు చేసింది.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు లింగాయత్ సీఎంలు అవినీతికి పాల్పడి రాష్ట్రాన్ని నాశనం చేశారంటూ సిద్ధరామయ్యచేసిన ప్రకటన సంచలనం రేపింది.

ఇది కూడా చదవండి : Arvind Kejriwal: సీఎం కేజ్రీవాల్ ఇంటి వద్ద అనుమానాస్పద డ్రోన్...ఢిల్లీ పోలీసుల విచారణ

సిద్దరామయ్య లింగాయత్ కమ్యూనిటీని అవమానించారని, పరువు తీశారని లింగాయత్ యువ వేదికే లీగల్ సెల్ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.‘‘నా వ్యాఖ్యల్లో బొమ్మాయ్ ని మాత్రమే ప్రస్తావించాను. బసవరాజ్ బొమ్మాయి ఒక్కడే అవినీతిపరుడని మాత్రమే చెప్పాను. లింగాయత్‌లు అవినీతిపరులని నేను అనలేదు. అందువల్ల, అటువంటి స్వీపింగ్ నివేదికను తయారు చేయడం సరికాదు. చాలా నిజాయితీ గల లింగాయత్ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎస్.నిజలింగప్ప, వీరేంద్ర పాటిల్ తదితరులు చాలా నిజాయితీపరులైన ముఖ్యమంత్రులంటే నాకు చాలా గౌరవం. నా వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించి తప్పుగా అర్థం చేసుకుంది’’ అని సిద్ధరామయ్య అన్నారు.ఇటీవల కాంగ్రెస్ చేరిన షెట్టర్ కూడా సిద్ధరామయ్యను సమర్థించారు

.

Updated Date - 2023-04-26T11:16:01+05:30 IST