Delhi Robbery: ఢిల్లీలో సినీ ఫక్కీలో దోపిడీ..కారు వెంబడించి..ఆపై తలకు గన్ గురిపెట్టి..
ABN , First Publish Date - 2023-06-26T13:34:32+05:30 IST
పట్టపగలే దోపిడిదొంగలు రెచ్చిపోయారు.సినీ ఫక్కీలో దోపిడీ. దొంగలు దోచుకునేందుకు వెంబడించే సీన్లను మరిపించే స్థాయిలో ఈ దొంగల ఛేజింగ్ ఉందంటే..ఈ వీడియో చూస్తే గానీ నమ్మలేరు. రెండు బైకులు, నలుగురు వ్యక్తులు..కారును వెంబడించి ఓ టన్నెల్‌లోకి వెళ్లగానే.. బైకులు కారుకు అడ్డంగా పెట్టి.. అందులో ఉన్నవారి తలకు తుపాకీ గురిపెట్టారు. డబ్బులున్న బ్యాగులు తీసుకొని దర్జాగా వెళ్లిపోయారు.
న్యూఢిల్లీ: పట్టపగలే దోపిడిదొంగలు రెచ్చిపోయారు.సినీ ఫక్కీలో దోపిడీ. దొంగలు దోచుకునేందుకు వెంబడించే సీన్లను మరిపించే స్థాయిలో ఈ దొంగల ఛేజింగ్ ఉందంటే..ఈ వీడియో చూస్తే గానీ నమ్మలేరు. రెండు బైకులు, నలుగురు వ్యక్తులు..కారును వెంబడించి ఓ టన్నెల్‌లోకి వెళ్లగానే.. బైకులు కారుకు అడ్డంగా పెట్టి.. అందులో ఉన్నవారి తలకు తుపాకీ గురిపెట్టారు. డబ్బులున్న బ్యాగులు తీసుకొని దర్జాగా వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళితే..
ఢిల్లీ(Delhi) ప్రగతి మైదాన్ టెన్నెల్‌లో(Pragati Maidan Tunnel) ఓ డెలివరీ ఏజెంట్, అతని సహచరుడి నుంచి నలుగురు గుర్తు తెలియన వ్యక్తులు తుపాకీతో బెదిరించి(Gunpoint) రూ.2 లక్షలు(Rs.2lakh) దోచుకెళ్లారు. బాధితుడు డబ్బును డెలివరీ చేసేందుకు క్యాబ్‌లో గురుగ్రామ్(Gurugram) వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. ప్రగతి మైదాన్ టన్నెల్ దాదాపు 1.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇది నోయిడా, సరయ్ కాలే ఖాన్‌లను కలుపుతుంది.
అయితే ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్( Delhi CM Arvind Kejriwal) స్పందిస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా (Lt Governor VK Saxena)రాజీనామా చేయాలని ట్వీట్ చేశారు. ‘‘కేంద్ర ప్రభుత్వం ఢిల్లీని సురక్షితంగా ఉంచలేకపోతే.. మాకు అప్పగించండి.. నగరాన్ని, పౌరులను ఎలా సురక్షించాలో చేసిన చూపిస్తాం’’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.