Share News

Cancellation of trains: 20 నుంచి చెన్నై- బిట్రగుంట రైళ్ల రద్దు

ABN , First Publish Date - 2023-11-17T07:17:06+05:30 IST

విజయవాడ, గుంతకల్‌(Vijayawada, Guntakal) మధ్య రైలుమార్గాల్లో మరమ్మతుల కారణంగా తిరుపతి, బిట్రగుంట వైపు వెళ్లే రైళ్లు

Cancellation of trains: 20 నుంచి చెన్నై- బిట్రగుంట రైళ్ల రద్దు

పెరంబూర్‌(చెన్నై): విజయవాడ, గుంతకల్‌(Vijayawada, Guntakal) మధ్య రైలుమార్గాల్లో మరమ్మతుల కారణంగా తిరుపతి, బిట్రగుంట వైపు వెళ్లే రైళ్లు ఈ నెల 20 నుంచి 26వ తేది వరకు రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలియజేసింది.

- నెం.17237 బిట్రగుంట-డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌, నెం.17238 డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌-బిట్రగుంట రైళ్లు ఈ నెల 20 నుంచి 24వ తేది వరకు రద్దు.

- నెం.07659 తిరుపతి-కాట్పాడి, నెం.07582 కాట్పాడి-తిరుపతి స్పెషల్‌ ప్యాసింజర్‌(Katpadi-Tirupati Special Passenger) రైళ్లు ఈ నెల 20 నుంచి 26వ తేది వరకు రద్దు.

- నెం.06417 కాట్పాడి-జోలార్‌పేట, నెం.06418 జోలార్‌పేట-కాట్పాడి మెమో రైళ్లు ఈ నెల 20 నుంచి 26 వరకు రద్దు,

- నెం.06411 అరక్కోణం-కడప, నెం.06401 కడప-అరక్కోణం స్పెషల్‌ మెమో రైళ్లు ఈ నెల 20 నుంచి 26వ తేది వరకు రద్దు.

పాక్షికంగా రద్దు....

- నెం.16854 విల్లుపురం-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ నెల 20 నుంచి 26వ తేది వరకు తిరుపతికి బదులుగా కాట్పాడి వరకు మాత్రమే నడుస్తుంది. అలాగే, నెం.16853 తిరుపతి-విల్లుపురం ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ నెల 20 నుంచి 26వ తేది వరకు తిరుపతికి బదులు కాట్పాడి నుండి బయల్దేరుతుంది.

Updated Date - 2023-11-17T07:17:07+05:30 IST