Share News

Parliament Security breach: పాసుల జారీపై తొలిసారి పెదవివిప్పిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా

ABN , Publish Date - Dec 24 , 2023 | 03:20 PM

ఈనెల 13న ఇద్దరు వ్యక్తులు పార్లమెంటు భద్రతా ఉల్లంఘనకు పాల్పడిన ఘటనతో చిక్కుల్లో పడిన మైసూలు లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా ఆదివారంనాడు తొలిసారి స్పందించారు. తాను దేశ భక్తుడనో, ద్రోహినో భగవంతుడికి మాత్రమే తెలుసునని అన్నారు. సింహా కార్యాలయం నుంచే ఇద్దరు నిందితులిద్దరూ పాస్‌లు పొందినట్టు ఆరోపణలు ఉన్నాయి.

Parliament Security breach: పాసుల జారీపై తొలిసారి పెదవివిప్పిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా

బెంగళూరు: ఈనెల 13న ఇద్దరు వ్యక్తులు పార్లమెంటు భద్రతా ఉల్లంఘన (Parliament Security breach)కు పాల్పడిన ఘటనతో చిక్కుల్లో పడిన మైసూలు లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా (Pratap simha) ఆదివారంనాడు తొలిసారి స్పందించారు. తాను దేశ భక్తుడనో, ద్రోహినో భగవంతుడికి మాత్రమే తెలుసునని అన్నారు. సింహా కార్యాలయం నుంచే ఇద్దరు నిందితులిద్దరూ పాస్‌లు పొందినట్టు ఆరోపణలు ఉన్నాయి.


''ప్రతాప్ సింహా దేశ భక్తుడా లేక దేశద్రోహా అనేది మాతా చాముండేశ్వరి, మా కావేరి, 20 ఏళ్లుగా నేను రాసిన ఆర్టికల్ట్స్ చూసి నన్ను అభిమనిస్తూ వచ్చిన మద్దతుదారులు, గత తొమ్మిదిన్నర ఏళ్లుగా తాను సేవలందిస్తున్న మైసూరు, కొడగు ప్రజలకు తెలుసు'' అని ఆయన సింహా చెప్పారు. దేశం, మతం, జాతీయత పరంగా తాను చేసిన సేవలు ప్రజలకు తెలుసనని అన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలే తాను ఎటువంటి వాడినో తీర్పు చెబుతారని, వారే అంతమ న్యాయనిర్ణేతలని అన్నారు. సింహాను 'దేశద్రోహి'గా చిత్రిస్తూ పోస్టర్లు వెలిసిన విషయంపై మీడియా అడిగినప్పుడు, ప్రజలే తానేమిటో నిర్ణయిస్తారని, ప్రజల విచక్షణకే దీనిని విడిచిపెడుతున్నానని అన్నారు. ఇంతకు మించి తానేమీ చెప్పలేనని తెలిపారు. పార్లమెటు భద్రతా ఉల్లంఘనపై పోలీసులు మీ స్టేట్‌మెంట్ రికార్డు చేశారా అనే ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం చెప్పలేదు. కాగా, పార్లమెంటు భద్రతా ఉల్లంఘనపై దర్యాప్తులో భాగంగా సిన్హా ప్రకటనను రికార్డు చేసినట్టు పార్లమెంటరీ వ్యవహరాల మత్రి ప్రహ్లాద్ జోషి గత శుక్రవారంనాడు చెప్పారు.


మరోవైపు, పార్లమెంటు భద్రతా ఉల్లంఘన వెనుక మనోరంజన్ డి.. ప్రధాన సూత్రధారిగా దర్యాప్తు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ ఘటనలో పట్టుబడిన ఆరుగురిలో మనోరంజన్ డి ఒకరు. మైసూరి నివాసి అయిన మనోరంజన్ సామాజిక కార్యక్రమాల కోసం ఇంజనీరింగ్ చదువు మధ్యలోనే వదిలేశాడు. అతను నిరుద్యోగి అయినప్పటికీ కాంబోడియాకు వెళ్లివచ్చినట్టు దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - Dec 24 , 2023 | 03:20 PM