Bangalore: సిద్దూకి అప్పుడే మొదలైంది..: సీనియర్‌ ఎమ్మెల్యేను.. నాకు మంత్రి పదవి లేదా?

ABN , First Publish Date - 2023-05-21T12:15:58+05:30 IST

శాసనసభలో అత్యంత ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా కొనసాగిన నన్ను మంత్రివర్గ జాబితాలో లేకుండా చేయడం సరికాదని

Bangalore: సిద్దూకి అప్పుడే మొదలైంది..: సీనియర్‌ ఎమ్మెల్యేను.. నాకు మంత్రి పదవి లేదా?

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): శాసనసభలో అత్యంత ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా కొనసాగిన నన్ను మంత్రివర్గ జాబితాలో లేకుండా చేయడం సరికాదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆర్‌వీ దేశ్‌పాండే(RV Deshpande) ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. తొలి జాబితాలో పేరు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 224 మంది ఎమ్మెల్యేలలో నేను సీనియర్‌ అన్నారు. 9సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందానన్నారు. కానీ జాబితాలో నా పేరు లేకపోవడం బాధ కలిగించిం దన్నారు. కాగా శుక్రవారం ఢిల్లీలో ఆయన శాసనసభ స్పీకర్‌ పదవిని నిభాయించ లేనన్నారు. కానీ ఆయనను ప్రోటెం స్పీకర్‌గా నియమించారు.

Updated Date - 2023-05-21T12:17:53+05:30 IST