Uttar Pradesh : ఉమేశ్ పాల్ కిడ్నాప్ కేసు... అతిక్ అహ్మద్‌కు జీవిత ఖైదు...

ABN , First Publish Date - 2023-03-28T14:23:40+05:30 IST

న్యాయవాది ఉమేశ్ పాల్ (Umesh Pal)ను 2006లో కిడ్నాప్ చేసిన కేసులో గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత అతిక్ అహ్మద్

Uttar Pradesh : ఉమేశ్ పాల్ కిడ్నాప్ కేసు... అతిక్ అహ్మద్‌కు జీవిత ఖైదు...
Atiq Ahmed

న్యూఢిల్లీ : న్యాయవాది ఉమేశ్ పాల్ (Umesh Pal)ను 2006లో కిడ్నాప్ చేసిన కేసులో గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత అతిక్ అహ్మద్ (Atiq Ahmad) దోషి అని ప్రయాగ్‌రాజ్‌లోని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. ఈ కేసులో ఆయనతోపాటు మొత్తం ముగ్గురు దోషులని చెప్తూ, వీరందరికీ జీవిత ఖైదు విధించింది. బీఎస్‌పీ నేత రాజు పాల్ (Raju Pal) హత్య కేసులో ఉమేశ్ పాల్ ప్రధాన సాక్షి. అయితే ఉమేశ్ పాల్‌ 2023 ఫిబ్రవరి 24న ప్రయాగ్‌రాజ్‌లో దారుణంగా హత్యకు గురయ్యారు.

భారత శిక్షా స్మృతి (IPC) సెక్షన్ 364ఏ (వ్యక్తిని అపహరించి, హత్యకు గురయ్యే ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టడం) ప్రకారం అతిక్, మరో ఇద్దరు దోషులని కోర్టు తీర్పు చెప్పింది. వీరందరికీ జీవిత ఖైదు విధించింది. అతిక్ అహ్మద్‌ను గుజరాత్ నుంచి సోమవారం ప్రయాగ్‌రాజ్‌కు తీసుకొచ్చారు. నైని కేంద్ర కారాగారంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉంచారు.

ఉమేశ్ పాల్ హత్య కేసులో కూడా అతిక్ ప్రధాన నిందితుడు. ఉత్తర ప్రదేశ్ పోలీసుల కస్టడీలో ఉన్న సమయంలో తనకు ప్రాణ హాని ఉందని, తనకు వారి నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అయితే అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించేందుకు అనుమతి ఇచ్చింది.

ఇవి కూడా చదవండి :

Gold and Silver Price : పెరగడమేమో వేలల్లో.. తగ్గితే పైసల్లో..

Adani Group : అదానీ చేతికి మరో ప్రముఖ మీడియా గ్రూప్

Updated Date - 2023-03-28T14:23:40+05:30 IST