‘కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్రం’

ABN , First Publish Date - 2023-03-21T00:05:42+05:30 IST

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాజు ఆరోపించారు. కార్మిక హక్కుల పరిరక్షణ, కనీస వేతనాల అమలు, ధరల నియంత్రణ, విద్యుత్‌ సవరణ బిల్లు-2022 ఉప సంహరణ, ఈజీఎస్‌ పథకానికి బడ్జెట్‌ కేటాయింపులు, 60 ఏళ్లు పైబడిన వారికి పెన్షన్‌ వంటి డిమాండ్ల సాధనకై ఏప్రిల్‌ 5న ఐదు లక్షల మందితో చలో పార్లమెంట్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

‘కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్రం’

ఆమనగల్లు, మార్చి20: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాజు ఆరోపించారు. కార్మిక హక్కుల పరిరక్షణ, కనీస వేతనాల అమలు, ధరల నియంత్రణ, విద్యుత్‌ సవరణ బిల్లు-2022 ఉప సంహరణ, ఈజీఎస్‌ పథకానికి బడ్జెట్‌ కేటాయింపులు, 60 ఏళ్లు పైబడిన వారికి పెన్షన్‌ వంటి డిమాండ్ల సాధనకై ఏప్రిల్‌ 5న ఐదు లక్షల మందితో చలో పార్లమెంట్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన జీపు జాత సోమవారం ఆమనగల్లు, కడ్తాల మండలాల పరిధిలో సాగింది. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలు, పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తూ కార్మికుల, కర్షకుల, పేదల బాధలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సీపీఎం జిల్లా నాయకులు కానుగుల వెంకటయ్య, సీఐటీయూ జిల్లా నాయకులు కురుమయ్య, శివశంకర్‌, లాలు నాయక్‌, కేవీపీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు దుబ్బ చెన్నయ్య పాల్గొన్నారు.

Updated Date - 2023-03-21T00:05:42+05:30 IST