Israel - Palestine: ఇజ్రాయెల్‌కి మద్దతుగా అగ్రరాజ్యం.. యుద్ధ విమానాలు పంపి కదనరంగంలోకి దిగిన అమెరికా

ABN , First Publish Date - 2023-10-09T12:08:31+05:30 IST

ఇజ్రాయెల్ - పాలస్తీనకు(Israel - Palestine) జరుగుతున్న యుద్ధంలో అగ్రరాజ్యం అమెరికా(America).. ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలిచి.. కదనరంగంలోకి దిగింది. ఇప్పటికే అమెరికా సేనలు ఆ దేశం తరఫున హమాస్ వ్యతిరేకంగా పోరాడుతుండగా.. యూఎస్ కి చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలు(Warships) ఇప్పుడు రంగంలోకి దిగాయి.

Israel - Palestine: ఇజ్రాయెల్‌కి మద్దతుగా అగ్రరాజ్యం.. యుద్ధ విమానాలు పంపి కదనరంగంలోకి దిగిన అమెరికా

న్యూయార్క్: ఇజ్రాయెల్ - పాలస్తీనకు(Israel - Palestine) జరుగుతున్న యుద్ధంలో అగ్రరాజ్యం అమెరికా(America).. ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలిచి.. కదనరంగంలోకి దిగింది. ఇప్పటికే అమెరికా సేనలు ఆ దేశం తరఫున హమాస్ వ్యతిరేకంగా పోరాడుతుండగా.. యూఎస్ కి చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలు(Warships) ఇప్పుడు రంగంలోకి దిగాయి. యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్(Joe Biden) ఆదేశాల మేరకు ఆ దేశ సైన్యం ఇప్పటికే వాటిని ఇజ్రాయెల్ కు చేరవేసినట్లు సమాచారం. యుద్ధ నౌకలు మధ్యదార సముద్రం ద్వారా ఇజ్రాయెల్ చేరుకుంటాయని అధికారులు తెలిపారు.


ఈ నౌకల్లో భూ, వాయు మార్గాల్లో దాడులు చేసే క్షిపణుల్ని(Aircrafts) అమెరికా సరఫరా చేస్తోంది. దాడుల్ని ముందుగానే పసిగట్టే అత్యాధునిక పరికరాలు ఇందులో ఉన్నాయని తెలుస్తోంది. తాజా ఘటన నేపథ్యంలో ఈ యుద్ధం ఎన్ని మలుపులు తిరుగుతుందోనని.. ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది కాస్తా..మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నాయి. శాంతి చర్చలు జరపాలంటూ, ఐక్యరాజ్యసమితి(UNO) జోక్యం చేసుకుని వివాదాన్ని సద్దుమణిగేలా చూడాలని వివిధ దేశాధినేతలు కోరుతున్నారు. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ పరస్పర రాకెట్ దాడుల్లో ఇప్పటికే వెయ్యి మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. వందల సంఖ్యలో గాయపడ్డారు.

Updated Date - 2023-10-09T12:08:31+05:30 IST