Share News

Happy New Year 2024: న్యూ ఇయర్ 2024కు ఫస్ట్ వెల్‌కమ్ చెప్పిన న్యూజిలాండ్..ఆకట్టుకుంటున్న లేజర్ షో

ABN , Publish Date - Dec 31 , 2023 | 05:29 PM

ప్రపంచంలోనే మొట్టమొదట నూతన సంవత్సర వేడుకలు న్యూజిల్యాండ్‌లో (New Zealand) మొదలయ్యాయి. అయితే అక్కడ ఇండియా కంటే ఏడు గంటల ముందే ఈ వేడుకలు మొదలు కావడం విశేషం. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Happy New Year 2024: న్యూ ఇయర్ 2024కు ఫస్ట్ వెల్‌కమ్ చెప్పిన న్యూజిలాండ్..ఆకట్టుకుంటున్న లేజర్ షో

ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే దేశం న్యూజిలాండ్(New Zealand). ఇది తూర్పు భాగంలో ఉన్నందున మొదట ఈ దేశంలోని ఆక్లాండ్‌ నగరంలో ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. అంటే భారతదేశానికి 7.30 గంటల ముందే ఇక్కడ నూతన సంవత్సర వేడుకలు మొదలు కావడం విశేషం.


ఈ క్రమంలో ఆక్లాండ్‌లోని(auckland) ప్రసిద్ధ స్కై టవర్(sky tower)ను మెరిసే లైట్లతో అలంకరించారు. లేజర్ షో ఏర్పాటు చేసి అక్కడకు పెద్ద ఎత్తున ప్రజలు చేరుకుని కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో స్కై టవర్ వద్ద బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ లైట్ల షో దూరం నుంచి చూస్తుంటే ఎంతో ఆకర్షనీయంగా కనిపిస్తుంది. దీంతోపాటు అనేక మంది సోషల్ మీడియా వేదికగా అందుకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

న్యూజిలాండ్‌ ఆక్లాండ్‌లోని స్కై టవర్ అత్యంత ప్రసిద్ధ భవనాలలో ఒకటి. ఈ టవర్ 25 ఏళ్ల నాటిది. దీని ఎత్తు 328 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 193 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక భారతదేశం(india)లో అర్ధరాత్రి 12 గంటల తర్వాత నూతన సంవత్సర వేడుకలు మొదలవుతాయి.

Updated Date - Dec 31 , 2023 | 10:01 PM