America Vs North Korea : జో బైడెన్‌పై కిమ్ సోదరి పరుష వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-04-30T15:47:08+05:30 IST

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) సోదరి కిమ్ యో జోంగ్ (Kim Yo Jong) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

America Vs North Korea : జో బైడెన్‌పై కిమ్ సోదరి పరుష వ్యాఖ్యలు
Joe Biden , Kim Yo Jong

న్యూఢిల్లీ : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) సోదరి కిమ్ యో జోంగ్ (Kim Yo Jong) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (President Joe Biden)పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ముసలాడు, ధైర్యవంతుడు అని, అయితే ఆయన బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అమెరికా-దక్షిణ కొరియా మధ్య కొత్త అణ్వాయుధాల ఒప్పందం కుదరడంతో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

జో బైడెన్ ఇటీవల మాట్లాడుతూ, అమెరికాపై కానీ, దాని మిత్ర పక్షాలు లేదా భాగస్వాములపై కానీ ఉత్తర కొరియా అణ్వాయుధ దాడి చేయడం ఆమోదయోగ్యం కాదన్నారు. ఒకవేళ ఆ దేశం అణ్వాయుధ దాడి చేస్తే, తాము కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం ఉండబోదని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో కిమ్ యో జోంగ్ మాట్లాడుతూ, జో బైడెన్ ముసలాడని, అంతేకాకుండా పరిస్థితులను చాలా తప్పుగా అంచనా వేస్తున్నారని దుయ్యబట్టారు. ఆయన బాధ్యతారహిత ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు. అమెరికా అధ్యక్షుడు వ్యక్తిగతంగా ఈ వ్యాఖ్యలు చేశారన్నారు. అమెరికా తమకు అత్యంత తీవ్రమైన శత్రువు అని తెలిపారు. ఈ మాటలు హెచ్చరిక స్వరంతో చేసిన బెదిరింపు అని మండిపడ్డారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు పర్యవసానాలను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలన్నారు. తమ శత్రువులు ఎంత ఎక్కువగా అణ్వాయుధ విన్యాసాలను చేస్తే, కొరియన్ ద్వీపకల్పం సమీపంలో ఎన్ని ఎక్కువ అణ్వాయుధాలను మోహరిస్తే, అంత తీవ్రమైన ప్రతిఘటనను ఎదుర్కొనవలసి వస్తుందని హెచ్చరించారు. అమెరికా, దక్షిణ కొరియా కంటున్న పగటి కలలకు ఇకపై మరింత బలమైన దెబ్బ తప్పదన్నారు.

ఇవి కూడా చదవండి :

Mann Ki Baat : ‘మన్ కీ బాత్’పై బిల్ గేట్స్ స్పందన

Mann Ki Baat : ఇతరుల మంచి లక్షణాలను ఆరాధిస్తా : ‘మన్ కీ బాత్’లో మోదీ

Updated Date - 2023-04-30T15:47:08+05:30 IST