Mann Ki Baat : ‘మన్ కీ బాత్’పై బిల్ గేట్స్ స్పందన

ABN , First Publish Date - 2023-04-30T11:12:15+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ప్రతి నెలా నిర్వహించే రేడియో కార్యక్రమం మన్ కీ బాత్

Mann Ki Baat : ‘మన్ కీ బాత్’పై బిల్ గేట్స్ స్పందన
Bill Gates

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ప్రతి నెలా నిర్వహించే రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ (Mann Ki Baat) 100 ఎపిసోడ్ ప్రసారమవుతున్న సందర్భంగా బిల్ గేట్స్ (Bill Gates) స్పందించారు. ప్రధాని మోదీని అభినందించారు. ఈ కార్యక్రమం వల్ల పారిశుద్ధ్యం, ఆరోగ్యం, మహిళల ఆర్థిక సాధికారత, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుబంధంగా ఉన్న ఇతర అంశాల్లో ప్రజాబాహుళ్యం నేతృత్వంలో కార్యాచరణ సాధ్యమైందని తెలిపారు.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) రోహ్‌తక్ నిర్వహించిన అధ్యయనంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని కనీసం ఒకసారి అయినా విన్నవారి సంఖ్య 100 కోట్లకు పైనేనని వెల్లడైంది. ప్రతి నెలా ప్రసారమవుతున్న ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వినేవారి సంఖ్య 23 కోట్లు అని తెలిసింది.

మోదీ మంచి పరిజ్ఞానంగలవారని, ప్రేక్షకులతో మానసికంగా అనుబంధాన్ని ఏర్పరచుకుంటున్నారని ప్రజలు భావిస్తున్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది.

మన్ కీ బాత్ కార్యక్రమం మొదటి ఎపిసోడ్ 2014 అక్టోబరు 3న ప్రసారమైంది.

ఇవి కూడా చదవండి :

Elections: దేశ చరిత్రలో తొలిసారిగా ఇంటి వద్దకే వెళ్లి..

Gas leak : లూథియానాలో గ్యాస్ లీక్.. నలుగురి మృతి..

Updated Date - 2023-04-30T11:12:15+05:30 IST