North Korea-China: జిన్‌పింగ్‌కు కిమ్ లేఖ.. అందులో ఏం ఉందంటే?

ABN , First Publish Date - 2023-09-24T11:05:02+05:30 IST

ఉత్తర కొరియా(North Korea), చైనా(China)ల మధ్య సంబంధాలు బలపడాలని కోరుకుంటున్నట్లు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోన్ ఉన్ (Kim Jong Un)తెలిపారు. ఇరు దేశాల సంబంధాలపై కిమ్ చైనాకు లేఖ రాశారు.

North Korea-China: జిన్‌పింగ్‌కు కిమ్ లేఖ.. అందులో ఏం ఉందంటే?

నార్త్ కొరియా:ఉత్తర కొరియా(North Korea), చైనా(China)ల మధ్య సంబంధాలు బలపడాలని కోరుకుంటున్నట్లు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ (Kim Jong Un)తెలిపారు. ఇరు దేశాల సంబంధాలపై కిమ్ చైనాకు లేఖ రాశారు. రెండు దేశాల మధ్య రక్షణ సంబంధాలు బలోపేతం చేసేందుకు చైనా ప్రెసిడెంట్జి జీ జిన్ పింగ్(Xi Jinping) సుముఖంగా ఉండటంతో ఆయన ధన్యవాదాలు తెలుపుతూ కిమ్ ఈ లేఖను పంపారు.


లేఖలో.. ఇరు దేశాల అవసరాలు, ప్రజల కోరిక మేరకు కలిసి కట్టుగా అభివృద్ధిపథంలో పయనిద్దాం అని రాసి ఉంది. ఈ లేఖను నార్త్ కొరియా రాష్ట్ర మీడియా కేసీఎన్ఏ ఆదివారం బయటపెట్టింది. కాగా, ఇటీవలే కిమ్ రష్యా(Russia) పర్యటనకు వెళ్లారు. ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ తో ఇరు దేశాల సంబంధాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇలా ఇరుగుపొరుగు దేశాల పట్ల కిమ్ సానుకూల వైఖరి చర్చనీయాంశం అవుతోంది.

Updated Date - 2023-09-24T11:12:12+05:30 IST