American Presidential Polls : మళ్లీ గెలుపు డొనాల్డ్ ట్రంప్‌దే : ఎలన్ మస్క్

ABN , First Publish Date - 2023-03-19T16:55:48+05:30 IST

అమెరికా అధ్యక్ష పదవికి 2024లో జరిగే ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మళ్లీ విజయం సాధిస్తారని టెస్లా,

American Presidential Polls : మళ్లీ గెలుపు డొనాల్డ్ ట్రంప్‌దే : ఎలన్ మస్క్
Donald Trump, Elon Musk

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష పదవికి 2024లో జరిగే ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మళ్లీ విజయం సాధిస్తారని టెస్లా, ట్విటర్ సీఈఓ ఎలన్ మస్క్ (Tesla and Twitter CEO Elon Musk) జోస్యం చెప్పారు. అయితే దీనికి మస్క్ ఓ మెలిక పెట్టారు. అదేమిటంటే, వచ్చే వారం ట్రంప్ అరెస్టయితే కచ్చితంగా భారీ ఆధిక్యంతో మరోసారి దేశాధ్యక్ష ఎన్నికల్లో గెలుస్తారన్నారు.

ఓ మీడియా కథనంలో ట్రంప్‌ను ఏ విధంగా సంకెళ్లు వేసి, చేతి వేలి ముద్రలు తీసుకుని, కోర్టు గదిలోకి తీసుకెళ్తారో రాశారు. ఈ కథనాన్ని మస్క్ ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. ఇదే జరిగితే ట్రంప్ మరోసారి దేశాధ్యక్ష ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తారన్నారు.

ట్రంప్ బిజినెస్ రికార్డులను తారుమారు చేసినట్లు మన్‌హటన్ డిస్ట్రిక్ట్ అటార్నీ అల్విన్ బ్రాగ్ ఆరోపణలను నమోదు చేసే అవకాశం ఉందని, ఈ కేసులో వచ్చే మంగళవారం తాను అరెస్టయ్యే అవకాశం ఉందని ట్రంప్ తన సొంత ట్రూత్ సోషల్ అనే సామాజిక మాధ్యమ వేదికలో పేర్కొన్నారు. ఈ చర్యలపై నిరసన తెలిపాలని తన మద్దతుదారులను కోరారు.

ఇవి కూడా చదవండి :

Punjab : అమృత్‌పాల్ సింగ్ పాకిస్థానీ ఐఎస్ఐ ఏజెంట్ : నిఘా వర్గాలు

Imran Khan : ఇమ్రాన్ ఖాన్‌పై మరో వేటుకు రంగం సిద్ధం?

Updated Date - 2023-03-19T16:55:48+05:30 IST