Earthquake : న్యూజిలాండ్‌లో భారీ భూకంపం...సునామీ హెచ్చరికల జారీ

ABN , First Publish Date - 2023-04-24T07:21:07+05:30 IST

న్యూజిలాండ్ దేశంలో సోమవారం భారీ భూకంపం సంభవించింది....

Earthquake : న్యూజిలాండ్‌లో భారీ భూకంపం...సునామీ హెచ్చరికల జారీ
New Zealand Earthquake

కెర్మాడెక్ (న్యూజిలాండ్): న్యూజిలాండ్ దేశంలో సోమవారం భారీ భూకంపం సంభవించింది.(Earthquake) కెర్మాడెక్ దీవుల ప్రాంతంలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదైంది. న్యూజిలాండ్(New Zealand) సమీపంలోని కెర్మాడెక్ దీవుల ప్రాంతంలో(Kermadec Islands region) సోమవారం భారీ భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) తెలిపింది.10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్లు యూఎస్‌జీఎస్ అధికారులు చెప్పారు. భూకంపం తర్వాత అమెరికా అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.గత నెలలో న్యూజిలాండ్ దేశంలో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో కెర్మాడెక్ దీవులను తాకింది.

Updated Date - 2023-04-24T07:21:07+05:30 IST