Earthquake: టర్కీలో మళ్లీ భూకంపం...భయాందోళనల్లో జనం

ABN , First Publish Date - 2023-04-17T07:45:21+05:30 IST

ఇటీవల భారీ భూకంపం విపత్తుతో అతలాకుతలమైన టర్కీలో మళ్లీ సోమవారం...

Earthquake: టర్కీలో మళ్లీ భూకంపం...భయాందోళనల్లో జనం
Turkey Earthquake

అప్సిన్ (టర్కీ): ఇటీవల భారీ భూకంపం విపత్తుతో అతలాకుతలమైన టర్కీలో మళ్లీ సోమవారం తెల్లవారుజామున మళ్లీ భూకంపం సంభవించింది.(Earthquake) టర్కీ దేశంలోని అప్సిన్ నగరంలో(Hits Afsin) సోమవారం తెల్లవారుజామున 10 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని టర్కీ అధికారులు చెప్పారు. ఇటీవల టర్కీలో సంభవించిన భారీ భూకంపంతో భూమి కంపిస్తే చాలు ప్రజలు తీవ్ర కలవరపడుతున్నారు.

Updated Date - 2023-04-17T07:45:21+05:30 IST