Bangladesh : ఢాకాలో పేలుడు... 11 మంది మృతి...

ABN , First Publish Date - 2023-03-07T20:28:02+05:30 IST

బంగ్లాదేశ్ (Bangladesh) రాజధాని నగరం ఢాకాలో ఓ భవనంలో పేలుడు సంభవించడంతో దాదాపు 11 మంది ప్రాణాలు కోల్పోగా,

Bangladesh : ఢాకాలో పేలుడు... 11 మంది మృతి...
Bangladesh, Dhaka

ఢాకా : బంగ్లాదేశ్ (Bangladesh) రాజధాని నగరం ఢాకాలో ఓ భవనంలో పేలుడు సంభవించడంతో దాదాపు 11 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 70 మంది గాయపడ్డారు. రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో మంగళవారం ఈ పేలుడు జరిగింది. ఈ పేలుడుకు కారణాలు ఇంకా తెలియలేదని అగ్నిమాపక శాఖ అధికారి ఒకరు తెలిపారు. సహాయక చర్యలు చేపట్టామని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు.

బంగ్లాదేశ్ మీడియా కథనాల ప్రకారం, స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 4.50 గంటలకు ఢాకా (Dhaka)లోని ఓ భవనంలో పేలుడు సంభవించింది. మంటలను ఆర్పేందుకు 5 అగ్నిమాపక శకటాలు హుటాహుటిన చేరుకున్నాయి. క్షతగాత్రులను ఢాకా మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌ (Dhaka Medical College Hospital)కు తరలించి, చికిత్స చేయిస్తున్నట్లు పోలీస్ ఇన్‌స్పెక్టర్ బచ్చు మియా చెప్పారు. వీరికి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.

పేలుడు సంభవించిన భవనంలో దిగువ అంతస్థుల్లో కొన్ని శానిటరీ ప్రొడక్ట్స్ దుకాణాలు ఉన్నాయి. దీనికి సమీపంలోనే BRAC Bank ఉంది. రోడ్డుపై నిలిపి ఉంచిన బస్సు కూడా ఈ పేలుడు ధాటికి దెబ్బతింది.

ఇవి కూడా చదవండి :

Indian Economy : భారత ఆర్థిక వ్యవస్థ మందగమనం తాత్కాలికమే : మూడీస్ అనలటిక్స్

Holi Celebrations : ఆరెస్సెస్ ఇలా హోళీ జరుపుకోవడం ఇదే తొలిసారి!

Updated Date - 2023-03-07T23:28:29+05:30 IST