Womens Health: ఈ పోషకాలు తీసుకుంటున్నారా?

ABN , First Publish Date - 2023-01-03T15:10:53+05:30 IST

మహిళల(Womens)కు పోషకాల అవసరం ఎక్కువ. మరీ ముఖ్యంగా కొన్ని శరీర జీవక్రియల కోసం కొన్ని కీలక పోషకాల లోపం ఏర్పడకుండా చూసుకోవాలి. అవేంటంటే...

Womens Health: ఈ పోషకాలు తీసుకుంటున్నారా?
ఈ పోషకాలు తీసుకుంటున్నారా?

మహిళల(Womens)కు పోషకాల అవసరం ఎక్కువ. మరీ ముఖ్యంగా కొన్ని శరీర జీవక్రియల కోసం కొన్ని కీలక పోషకాల లోపం ఏర్పడకుండా చూసుకోవాలి. అవేంటంటే...

ఐరన్‌: శక్తి భాండాగారమిది. శరీరమంతా ఆక్సిజన్‌(Oxygen) ప్రసారానికి ఈ పోషకం అవసరం. రోగనిరోధకశక్తి(Immunity)కి దన్నుగా ఉండి, కండరాల పనితీరును క్రమపరిచే ఐరన్‌ లోపం ఏర్పడకుండా చూసుకోవాలి. ఇందుకోసం ఆకుకూరలు, మాంసాహారం సరిపడా తీసుకుంటూ ఉండాలి.

బయోటిన్‌: చర్మం(skin), వెంట్రుకలు(hair), గోళ్ల ఆరోగ్యానికి ఈ పోషకం అవసరం. నాడుల పనితీరు మెరుగ్గా ఉండాలన్నా, జీర్ణ వ్యవస్థ, గుండె(heart) పనితీరు సక్రమంగా సాగాలన్నా, మెటబాలిజం సమర్ధంగా ఉండాలన్నా బయోటిన్‌ సమృద్ధిగా ఉండే గుడ్లు, చిక్కుళ్లు, నట్స్‌, సీడ్స్‌, చిలకడ దుంపలు, మష్రూమ్స్‌ తింటూ ఉండాలి.

మెగ్నీషియం: గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. భావోద్వేగాలను అదుపులో ఉంచుతుంది. నెలసరి నొప్పులను తగ్గిస్తుంది. కండరాల బలహీనతను తొలగిస్తుంది. కాబట్టి మెగ్నీషియంతో కూడిన అరటిపండ్లు, అవకాడొ, పాలకూర, గుమ్మడి విత్తనాలు, సబ్జా గింజలు, బాదం, జీడిపప్పు, సోయా తింటూ ఉండాలి.

బి12: మెదడు సక్రమ పనితీరుకు బి12 అవసరం. నాడీ వ్యవస్థ మెరుగ్గా ఉండాలన్నా, రక్తకణాల సంఖ్య పెరిగి, శక్తి సమకూరాలన్నా బి12 దొరికే మాంసాహారం, పాల ఉత్పత్తులు సరిపడా తీసుకుంటూ ఉండాలి.

క్యాల్షియం: ఎముకల పటుత్వానికి క్యాల్షియం అవసరం. గుండె, నాడులు, కండరాల పనితీరుకు తోడ్పడే క్యాల్షియం కోసం పాల ఉత్పత్తులు, నువ్వులు తీసుకుంటూ ఉండాలి.

విటమిన్‌ డి: మెదడు, కండరాలు, ఇమ్యూనిటీలకు విటమిన్‌ డి అవసరం. ఈ విటమిన్‌ కోసం గుడ్లు, చేపలు, పాలు, నారింజ రసం, జున్ను, సోయా తీసుకుంటూ ఉండాలి.

Updated Date - 2023-01-03T15:10:55+05:30 IST