Trigger finger: ‘ట్రిగ్గర్‌ ఫింగర్‌’ పొంచి ఉంది.. జాగ్రత్త!

ABN , First Publish Date - 2023-10-05T11:45:27+05:30 IST

బైల్స్‌, కంప్యూటర్స్‌ మన జీవితంలో భాగమయిపోయాయి. టచ్‌స్ర్కీన్ల వినియోగం కూడా బాగా పెరిగింది. వీటి వల్ల మన చేతి వేళ్లపై అదనపు ఒత్తిడి పడుతోంది. ఈ ఒత్తిడి వల్ల ‘ట్రిగ్గర్‌ ఫింగర్‌’ అనే సమస్య వస్తోందని వైద్య నిపుణులు

Trigger finger: ‘ట్రిగ్గర్‌ ఫింగర్‌’ పొంచి ఉంది.. జాగ్రత్త!

బైల్స్‌, కంప్యూటర్స్‌ మన జీవితంలో భాగమయిపోయాయి. టచ్‌స్ర్కీన్ల వినియోగం కూడా బాగా పెరిగింది. వీటి వల్ల మన చేతి వేళ్లపై అదనపు ఒత్తిడి పడుతోంది. ఈ ఒత్తిడి వల్ల ‘ట్రిగ్గర్‌ ఫింగర్‌’ అనే సమస్య వస్తోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 20 కోట్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని ఒక అంచనా.

ట్రిగ్గర్‌ ఫింగర్‌ అంటే ఏమిటి?

మన చేతి వేళ్లు చాలా వేగంగా కదులుతాయి. అలాంటి వేళ్ల కదలికలు మందగించి.. నెప్పి పెడుతున్నాయంటే ట్రిగ్గర్‌ ఫింగర్‌ ఉందని అర్ధం. ఈ వేళ్లను కదిపినప్పుడు చిన్న శబ్దం కూడా వస్తుంది. ముఖ్యంగా ఉదయం లేచిన వెంటనే చేతి వేళ్లు నెప్పిగా ఉన్నాయంటే ట్రిగ్గర్‌ ఫింగర్‌ ఉన్నట్లే లెక్క. కొన్ని సార్లు వేలు నిటారుగా లేదా కొద్దిగా వంగి ఉండిపోతుంది. ముందుకు, వెనక్కి కదలదు. ఇది కూడా ట్రిగ్గర్‌ ఫింగర్‌ లక్షణమే!

ఎందుకొస్తుంది?

చేతి వేళ్ల కింద భాగంలో మృదువైన కణజాలం ఉంటుంది. దీనిపై ఒత్తిడి పడినప్పుడు అది వాచిపోతుంది. కంప్యూటర్‌పై ఎక్కువగా టైప్‌ చేసినా.. ఫోన్‌ టచ్‌స్ర్కీన్‌ను ఎక్కువగా కదిపినా- ఆ ఒత్తిడి మృదుకణజాలంపై పడుతుంది. ఈ ఒత్తిడి ఎక్కువ కాలం ఉంటే వేలు కదలికలలోనే మార్పు వస్తుంది. దీని వల్ల నెప్పి కూడా పెరుగుతుంది.

చికిత్స ఏమిటి?

చేతి వేళ్లకు వీలైనంత ఎక్కువ విశ్రాంతి ఇవ్వటం ఒకటే మార్గం. ఒక వేళ విశ్రాంతి ఇచ్చిన తర్వాత కూడా నెప్పి తగ్గకపోతే డాక్టర్‌కు చూపించుకోవటం మంచిది.

Updated Date - 2023-10-05T11:47:23+05:30 IST