Vegetables: ఆ అపోహలో పచ్చి కూరగాయలు తింటే మాత్రం..!

ABN , First Publish Date - 2023-08-16T11:35:18+05:30 IST

పచ్చి ఆకు కూరలు.. కూరగాయలు తింటే ఆరోగ్యం అనే అపోహ ఒకటి ప్రచారంలో ఉంది. అన్ని రకాల కూరలు.. పచ్చి ఆకు కూరలు ఆరోగ్యానికి మంచి చేయకపోగా- చెడు చేస్తాయని పౌష్టికాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని ఉడకపెట్టి లేదా వేయించి మాత్రమే తినాలని సలహా ఇస్తున్నారు.

Vegetables: ఆ అపోహలో పచ్చి కూరగాయలు తింటే మాత్రం..!

పచ్చి ఆకు కూరలు.. కూరగాయలు తింటే ఆరోగ్యం అనే అపోహ ఒకటి ప్రచారంలో ఉంది. అన్ని రకాల కూరలు.. పచ్చి ఆకు కూరలు ఆరోగ్యానికి మంచి చేయకపోగా- చెడు చేస్తాయని పౌష్టికాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని ఉడకపెట్టి లేదా వేయించి మాత్రమే తినాలని సలహా ఇస్తున్నారు.

చేమదుంపల ఆకులు

ఈ మధ్యకాలంలో చేమదుంపల ఆకులను సలాడ్‌ రూపంలో తినటం ఒక క్రేజ్‌గా మారింది. అయితే ఈ ఆకులను పచ్చిగా తినకూడదని.. దీనిలో ఉండే ఆక్సేలిక్‌ యాసిడ్‌ వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశముంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఆకులను ఉడకపెట్టి కూర చేసుకొని తింటే ఆక్సేలిక్‌ యాసిడ్‌ తగ్గిపోతుందని.. అందువల్ల ఆరోగ్యానికి ప్రమాదం ఉండదని పేర్కొంటున్నారు.

క్యాబేజీ

క్యాబేజీ ఆకులు చూడటానికి చాలా మృదువుగా.. ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కానీ వాటిలో టేప్‌వార్మ్స్‌ ఉండే అవకాశముంది. అందువల్ల పచ్చి క్యాబేజీ ఆకులను తింటే అజీర్తి, విరోచనాలు వంటి సమస్యలు ఏర్పడే అవకాశముంది.

క్యాప్సికం

క్యాప్సికంను తినేటప్పుడు - గింజలను తొలగించి తినమని పౌష్టికాహార నిపుణులు సలహా ఇస్తున్నారు. చాలా సార్లు క్యాప్సికం గింజల్లో తెలియకుండానే టేప్‌వార్మ్స్‌ గుడ్లు ఉంటాయి. ఇవి మన శరీరంలోకి ప్రవేశిస్తే- అనేక రకాల సమస్యలను కలగజేస్తాయి. అందువల్ల క్యాప్సికంపై భాగాన్ని మాత్రమే తినమని నిపుణులు సలహా ఇస్తున్నారు.

వంకాయ

పచ్చివంకాయలను తినవద్దని.. వీలైనంత వరకు ఉడకపెట్టి లేదా కూర చేసుకొని మాత్రమే తినమని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. వంకాయ గింజల్లో టేప్‌వార్మ్‌ గుడ్లు ఉండే అవకాశముందని వీరు హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2023-08-16T11:35:18+05:30 IST