Exam season: విద్యార్థులకు పోషకాహార నిపుణుల హెచ్చరికలు ఇవే..!
ABN , First Publish Date - 2023-03-15T12:48:03+05:30 IST
పరీక్షల కాలం (Exam season) మొదలైంది. ఇంటర్ (Inter), వెనువెంటనే పదో తరగతి (Tenth), ఇంజినీరింగ్ సెమిస్టర్ (Engineering semester) పరీక్షలు. ఇలా వరుసగా పరీక్షలు వస్తున్నాయి. పిల్లలు మాత్రమే

సరైన డైట్‌తో మెరుగైన ఫలితాలంటున్న న్యూట్రిషియనిస్టులు
హైదరాబాద్ సిటీ, మార్చి14 (ఆంధ్రజ్యోతి): పరీక్షల కాలం (Exam season) మొదలైంది. ఇంటర్ (Inter), వెనువెంటనే పదో తరగతి (Tenth), ఇంజినీరింగ్ సెమిస్టర్ (Engineering semester) పరీక్షలు. ఇలా వరుసగా పరీక్షలు వస్తున్నాయి. పిల్లలు మాత్రమే కాదు వారి తల్లిదండ్రులు కూడా ఒత్తిడితో సతమతమవుతున్నారు. ఈ ఒత్తిడిలో సరిగా నిద్రపోక పోవడం, తినక పోవడమూ చేస్తున్నారు. అయితే, తినకపోవడం వల్ల లాభం కంటే నష్టాలే ఎక్కువగా జరిగే అవకాశాలున్నాయని పోషకాహార నిపుణులు (Nutritionists) హెచ్చరిస్తున్నారు. పరీక్షల సమయంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనే అంశమై కన్సల్టెంట్ న్యూట్రిషియనిస్ట్ నిఖిత ఇలా చెబుతున్నారు.
పరీక్షల వేళ మెదడు చురుగ్గా పనిచేయాలంటే బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరి. అందునా ప్రొటీన్, విటమిన్స్, మినరల్స్ సమాహారంలా ఈ బ్రేక్‌ఫాస్ట్ ఉండాలి. బ్రేక్‌ఫా్‌స్టలో నట్స్‌తో కూడిన ఓట్స్, అరటి, యాపిల్, బొప్పాయి లాంటి పళ్లు ఉంటే మంచిది. ఇడ్లీ, దోశ ప్రియులైతే రాగి ఇడ్లీలకు ప్రాధాన్యమివ్వాలి. రాత్రిళ్లు అయితే ఓట్స్, బార్లీ, బ్రౌన్ రైస్, నట్స్ లాంటి విటమిన్ బీ, జింక్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవాలి.
ఒత్తిడి తగ్గించుకోవాలనుకునే వారు ఆకు కూరలు, ఆరెంజ్, గ్రేప్స్, యాపిల్స్, అరటి వంటివి తీసుకోవచ్చు. పరీక్షలంటేనే ఒత్తిడి. ఈ ఒత్తిడి అధిగమించడానికి నీటిలో కరిగేటటువంటి విటమిన్స్‌ను అధికంగా తీసుకోవాలి. అంటే విటమిన్ సీ, బీ కాంప్లెక్స్ విటమిన్స్. తక్కువ కొవ్వుశాతం ఉన్న పాలు, గుడ్లు తదితరాలు కూడా తీసుకోవచ్చు.
సీజన్‌కు తగినట్లుగా తాజా పళ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. మరీ ముఖ్యంగా ఆరెంజ్, లెమన్, కివి, స్ట్రాబెర్రీ లాంటివి. కూరగాయలలో టమాట, గ్రీన్ పెప్పర్స్, ఆకు కూరలు తీసుకోవడం వల్ల తగిన శక్తి లభించడంతోపాటుగా త్వరగా అనారోగ్యం బారిన పడకుండా కాపాడతాయి. అలాగే ఒత్తిడి నుంచి ఉపశమనమూ అందిస్తాయి.
ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత కూడా మెరుగుపడుతుంది. చేపలలో ఈ ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా లభిస్తుందన్నది నిజమే. వాల్‌నట్ లాంటి వాటిలో కూడా ఎక్కువగానే లభిస్తుంది.
చదువు ధ్యాసలో పడితే మంచినీరు తాగడం కూడా మరిచిపోతుంటారు చాలామంది. అసలే వేసవి. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగాలి. మధ్య మధ్యలో మజ్జిగ, కొబ్బరినీళ్లు లాంటివి కూడా తీసుకోవచ్చు. శీతలపానీయాలు, ప్యాకేజ్డ్ డ్రింక్స్, కాఫీ,టీల జోలికి వెళ్లకూడదు.
జ్ఞాపకశక్తి మెరుగుపడేందుకు మెమరీ బూస్టర్స్‌గా
గుడ్లు, క్యారెట్లు, చేపలు, నట్స్, ఆకు కూరలు, పళ్లు తోడ్పడతాయి. వీటిలో విటమిన్ ఏ, ఈ, సీ వంటివి అధికంగా ఉంటాయి కాబట్టి మెదడులో కణజాల నష్టాన్ని తగ్గిస్తాయి.
స్నాక్స్ తీసుకోవాలి. కానీ, కొవ్వు, షుగర్ లెవల్స్ అధికంగా ఉన్న స్నాక్స్ తీసుకోకూడదు. వెజిటేబుల్ చీజ్ శాండ్‌విచ్ లాంటివి మంచిది. అలాగని పిజ్జా, బర్గర్‌లు, వేపుళ్లకు దూరంగా ఉండాలి.