Milk Tea Side Effects: పరకడుపున పాలు కలిపిన టీ తాగితే ఈ 7 ప్రమాదకర సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడటం ఖాయమట..!

ABN , First Publish Date - 2023-04-04T13:25:11+05:30 IST

పొద్దుటే లేచి చిక్కటి పాలతో వేడి వేడి టీ తాగనిదే రోజు గడవటం చాలా మందికి కష్టం. అయితే దీని వల్ల దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా?

Milk Tea Side Effects: పరకడుపున పాలు కలిపిన టీ తాగితే ఈ 7 ప్రమాదకర సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడటం ఖాయమట..!

పొద్దుటే లేచి చిక్కటి పాలతో వేడి వేడి టీ తాగనిదే రోజు గడవటం చాలా మందికి కష్టం. అయితే దీని వల్ల దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? ముఖ్యంగా ఖాళీ కడుపుతో మిల్క్ టీ తాగితే దాని వల్ల ఎదుర్కొనే సమస్యలు కాస్త ఎక్కువగానే ఉంటాయట.

కడుపు ఉబ్బరం

మిల్క్ టీని ఎక్కువగా తాగడం వల్ల కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. టీలో కెఫిన్ ఉంటుంది. దీని వల్ల కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. డికాషన్‌ను పాలు కలిపినప్పుడు రెండూ గ్యాస్ ఉత్పత్తిని పెంచుతాయి. టీలో ఉండే టానిన్లు జీర్ణవ్యవస్థకు అంతరాయం కలిగిస్తాయి. తద్వారా కడుపు నొప్పి, ఉబ్బరం వంటి తయారవుతాయి.

మలబద్ధకం..

కెఫిన్‌తో పాటు, టీలో థియోఫిలిన్ కూడా ఉంటుంది. టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం పొడిబారుతుంది. డీహైడ్రేట్ అవుతుంది. తద్వారా తీవ్రమైన మలబద్ధకం కలుగుతుందట.

ఆందోళన

మీరు ఆందోళనకు గురవుతుంటే పదే పదే టీ తాగడం మానేయండి. టీ అనేది ఆందోళన తాలుకూ లక్షణాలను ప్రేరేపిస్తుంది.

నిద్రలేమి

టీలో కెఫిన్ ఉంటుంది. ఇది నిద్రకు అంతరాయం కలిగిస్తుంది.. అలాగే నిద్రలేమికి కారణమవుతుంది. కాబట్టి నిద్రలేమితో బాధపడేవారు మిల్క్ టీ తాగడం మానుకోండి.

బీపీ హెచ్చుతగ్గులు..

రక్తపోటు అనేది ఎన్నో ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తుంది. మిల్క్ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు అసమతుల్యత ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికే అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు మిల్క్ టీని తీసుకోవడం తగ్గించాలి.

డీహైడ్రేషన్

మిల్క్ టీ తాలూకు అత్యంత ప్రమాదకరమైన దుష్ప్రభావాలలో ఒకటి డీహైడ్రేషన్. ఇది ప్రధానంగా కెఫిన్ కంటెంట్ కారణంగా జరుగుతుంది. అందువల్ల ఖాళీ కడుపుతో మిల్క్ టీని తాగవద్దు.

తలనొప్పి

మిల్క్ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్‌కు దారి తీస్తుంది. ఫలితంగా ఇది తలనొప్పికి కారణమవుతుంది. కాబట్టి పాలు, పంచదార కలిపిన టీని ఎక్కువగా తాగడం మానుకోవాలి.

Updated Date - 2023-04-04T13:25:11+05:30 IST