Summer: వడదెబ్బ తగలకుండా ఉండాలంటే...!

ABN , First Publish Date - 2023-03-13T12:13:51+05:30 IST

వేసవి కాలం వచ్చేసింది. ఎండలు ముదురుతున్నాయి. ఎండలో తిరిగేవారికి వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వడదెబ్బ తగిలితే

Summer: వడదెబ్బ తగలకుండా ఉండాలంటే...!
ఇలా చేయండి!

వేసవి కాలం వచ్చేసింది. ఎండలు ముదురుతున్నాయి. ఎండలో తిరిగేవారికి వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వడదెబ్బ తగిలితే ఏం చేయాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోవాలి.

వీటిని చేయొద్దు

  • ఎండలు ఎక్కువగా ఉంటే బయటకు వెళ్లకపోవడం ఉత్తమం.

  • ఎండా కాలంలో మద్యం తాగొద్దు.

  • రోడ్లపై విక్రయించే రంగు పానీయాలు అసలు తాగొద్దు.

  • ఫుట్‌పాత్‌లపై విక్రయించే ఆహారం తినొద్దు.

  • మాంసాహారం తగ్గించాలి. తాజా కూరగాయలు, ఆకుకూరలు బాగా తినాలి.

  • ఇంటి చుట్టూ మురికినీరు నిల్వ ఉండకుండా శుభ్రంగా ఉంచుకోవాలి.

ఇలా చేయండి..

  • నీరు, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.

  • రోజూ 15 గ్లాస్‌ల నీరు తాగాలి.

  • పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.

  • మిత ఆహారం తీసుకోవాలి.

  • రెండు పూటల స్నానం చేయాలి.

    కాటన్‌ దుస్తులు ధరించాలి.

  • ఇంటి బయట నిద్రపోతే దోమతెర కట్టుకోవాలి.

  • ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు తీసుకెళ్లాలి లేదా టోపీ పెట్టుకోవాలి.

  • ఇంట్లో కిటికీలు తెరిచి ఫ్యాన్‌వేసి గది చల్ల బడేలా చూడాలి.

రోజూ మజ్జిగ తాగాలి

వేసవిలో వడ దెబ్బ సమస్య ఎక్కువగా ఉంటుంది. వేడి చేస్తుంది. బయట నుంచి ఇంటికి రాగానే ఫ్రిజ్‌లో పెట్టిన నీరు, శీతల పానీయాలు తాగితే ఆరోగ్యం దెబ్బతింటుంది. జ్యూస్‌, మజ్జిగ తయారు చేసుకొని ప్రతిరోజూ తాగాలి.

వడదెబ్బ తగిలితే ఇలా చేయాలి

  • వడ దెబ్బతగిలిన వ్యక్తిని నీడలో పడుకోబెట్టాలి.

  • చల్లని నీటిలో లేదా ఐస్‌లో ముంచిన గుడ్డతో శరీరం అంతా తుడవాలి. సాధారణ స్థితికి వచ్చే వరకు ఇలా చేయాలి.

  • ఇంట్లో ఫ్యాన్‌ గాలి, లేదా చల్లని గాలి తగిలేలా ఏర్పాటు చేయాలి.

  • ఉప్పు కలిపిన మజ్జిగ లేదా చిటికెడు ఉప్పు కలిపిన గ్లూకోజ్‌ వాటర్‌, ఓఆర్‌ఎ్‌స తాగించాలి.

  • వీలైనంత త్వరగా ఆస్పత్రికి తీసుకెళ్లాలి.

ఆయుర్వేద జ్యూస్‌ తాగండి

వేసవిలో వడ దెబ్బ సమస్య ఎక్కువగా ఉంటుంది. వేడి చేస్తుంది. బయట తిరిగి ఇంటికి రాగానే చల్లని ఫ్రిజ్‌ నీరు, శీతల పానియాల తాగితే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇందుకోసం మనం ఇంట్లోనే జ్యూస్‌, మజ్జిక తయారు చేసుకుని ప్రతిరోజు తాగాలి.

తయారు చేసే విధానం

ఒక లీటర్‌ నీరు తీసుకుని కాచాలి. మరిగిన వెంటనే కచ్చాపక్కా దంచిన 10 గ్రాముల దనియాలు అందులో వేయాలి. ఆ తర్వాత ఐదు ఇలాచ్చిలు (యాలకులు) దంచి అందులో వేయాలి. చల్లారిన తర్వాత ప్రతి మనిషి ఒక 200 ఎంఎల్‌ తాగాలి. ఎండాకాలంలో ఇంత కంటే ఆరోగ్యకరమైన జ్యూస్‌ మరొకటి లేదు. ఎక్కువ తాగితే జలుబు చేస్తుంది.

జ్యూస్‌ తాగడం వలన కలిగే ప్రయోజనాలు..

  • కాళ్లు, చేతుల మంటలు తగ్గుతాయి.

  • మూత్రం వేడి చేయకుండ ఉంటుంది.

  • తలతిరగడం తగ్గుతుంది.

  • ఎండ వలన కలిగే కళ్ల మంటలు తగ్గుతాయి.

- ప్రదీప్‌ జి నోరి, ఆయుర్వేద వైద్యుడు, మణికొండ

-హైదరాబాద్, నార్సింగ్‌, మార్చి 12 (ఆంధ్రజ్యోతి)

Updated Date - 2023-03-13T12:21:38+05:30 IST