Hypothyroid: థైరాయిడ్ వల్ల బరువు తగ్గలేకపోతున్నారా..? ఈ విషయం తెలిస్తే పండగ చేసుకుంటారు..!

ABN , First Publish Date - 2023-04-01T09:51:21+05:30 IST

ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో హైపో థైరాయిడిజం ఒకటి. వీరికి ఉదయం లేస్తే ట్యాబ్లెట్ పడకుంటే తలెత్తే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.

Hypothyroid: థైరాయిడ్ వల్ల బరువు తగ్గలేకపోతున్నారా..? ఈ విషయం తెలిస్తే పండగ చేసుకుంటారు..!

ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో హైపో థైరాయిడిజం ఒకటి. వీరికి ఉదయం లేస్తే ట్యాబ్లెట్ పడకుంటే తలెత్తే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. మయో క్లినిక్ ప్రకారం చెప్పాలంటే.. హైపో థైరాయిడిజం.. అండర్ యాక్టివ్ థైరాయిడ్ అనేది థైరాయిడ్ గ్రంధి కొన్ని కీలకమైన హార్మోన్లను తగినంతగా ఉత్పత్తి చేయక పోవడం వల్ల తలెత్తే సమస్యలు. ఈ సమస్యను వెంటనే గుర్తించి వీలైనంత త్వరగా చికిత్స అందించకుంటే పరిస్థితి దారుణంగా మారుతుంది. ఒక్కోసారి స్ట్రోక్‌కు గురయ్యే అవకాశాలు కూడా తలెత్తవచ్చు. సమస్యను గుర్తించి సరిగా చికిత్స తీసుకోకుంటే మాత్రం.. ఊబకాయం, కీళ్ళ నొప్పులు, సంతాన సమస్యలు, గుండె జబ్బులు సహా ఇతర ఆరోగ్య సమస్యలకి కారణమవుతుంది. అయితే చికిత్స తీసుకున్నా కూడా హైపో థైరాయిడ్‌తో బాధపడేవారు బరువు పెరుగుతూనే ఉంటారు. కానీ ఈ విషయం తెలిస్తే మాత్రం పండగ చేసుకుంటారు. థైరాయిడ్‌తో బాధపడేవారికి నిపుణులు బరువు తగ్గడానికి 6 డైట్ సీక్రెట్స్ వెల్లడించారు. అవి పాటిస్తే బరువు తగ్గడం ఖాయమట. అవేంటంటే..

1. అయోడిన్ వినియోగాన్ని పెంచడం..

థైరాయిడ్ ప్రధాన కారణాల్లో ఒకటి.. అయోడిన్ లోపం. నిజానికి అయోడిన్ వినియోగం తగ్గించాలని నిపుణులు చెబతుంటారు. కానీ హైపో థైరాయిడ్ ఉన్న వారు మాత్రం తినే ఆహారంలో అయోడిన్‌ను జోడించాలట. మీరు మీ ఆహారంలో ఎక్కువ అయోడిన్‌ని జోడించడం ద్వారా నష్టాన్ని భర్తీ చేయవచ్చు. దీని అర్థం మీరు ఎక్కువ ఉప్పు తీసుకుంటారని కాదు. అయోడైజ్డ్ ఉప్పును మాత్రమే వాడేలా జాగ్రత్త పడాలని మాత్రమే. ఇక టేబుల్ సాల్ట్‌ను మాత్రమే తప్పనిసరిగా వాడాలని భావిస్తే మాత్రం పింక్ లేదా బ్లాక్ సాల్ట్ తీసుకోండి.

2. ఎక్కువ ఫైబర్ ఉండేలా చూసుకోండి..

ఇక మీరు తీసుకునే ఆహారంలో ఎక్కువ ఫైబర్ ఉండేలా చూసుకోండి. అది మీ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఫైబర్ అధికంగా తీసుకోవడం వల్ల థైరాయిడ్‌ కూడా పెరగదు. పైగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. మీరు పచ్చి కూరగాయలు, పండ్లు, సలాడ్లు, గోధుమ పిండి, బియ్యం, వోట్స్, మిల్లెట్స్ వంటి తృణధాన్యాల నుంచి పెద్ద మొత్తంలో ఫైబర్ పొందవచ్చు.

3. ఎక్కువ సెలీనియం-రిచ్ ఫుడ్స్‌ను తీసుకోండి..

సెలీనియం అనేది థైరాయిడ్ ఫంక్షనింగ్‌కు ముఖ్యమైన ఒక ట్రేస్ మినరల్. ఇది శరీరం టీఎస్‌హెచ్ హార్మోన్‌ను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. సెలీనియం లోపం వల్ల బరువు పెరుగుతారని.. రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని అంటున్నారు. గింజలు, గుడ్లు, పెసర పప్పు, రాజ్మా, చోలే వంటి మొత్తం పప్పుధాన్యాల్లో సెలీనియం కావాల్సినంత లభిస్తుంది.

4. సింపుల్ షుగర్స్, హై-కార్బ్ ఫుడ్స్‌కి దూరంగా ఉండండి..

హైపో థైరాయిడ్ ఉన్నవారు షుగర్ పదార్థాలతో పాటు కార్బో హైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న పదార్థాలకు దూరంగా ఉండండి. షుగర్, కార్బోహైడ్రేట్లు బరువు పెరగడానికి మెయిన్ కారణం. మంచి కార్బోహైడ్రేట్స్ కూడా ఉన్నాయి. వాటిని మాత్రమే తీసుకోండి.

5. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్‌ని ఫాలో అవ్వండి

మనలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే.. మన శరీరం థైరాయిడ్ సమస్యలకు ఎక్కువగా గురవుతుంది. థైరాయిడ్‌ను కంట్రోల్‌లో పెట్టాలన్నా.. బరువు తగ్గాలన్నా కూడా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఆహారాలను ఎక్కువగా తీసుకుని రోగనిరోధక శక్తిని పెంచుకోండి. పసుపు, అల్లం, సీడ్స్, మసాలా దినుసులు, బచ్చలికూర, మెంతులు వంటి ఆకు కూరలు మంచి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్స్.

6. హైడ్రేటెడ్ గా ఉండండి..

నీటిని వీలైనంత ఎక్కువగా తీసుకోండి. ఇవి హార్మోన్లను అదుపులో ఉంచుతాయి. అలాగే ఆకలిని అరికడతాయి. శరీరం ఎంత హైడ్రేటెడ్‌గా అంతగా బలంగా తయారవుతుంది. పోషకాలను బాగా గ్రహిస్తుంది. ప్రతిరోజూ 10-12 గ్లాసులు లేదంటే 21/2-3 లీటర్ల నీటిని తాగడం అలవాటు చేసుకోండి.

Updated Date - 2023-04-01T09:57:09+05:30 IST