Food : ఈ పదార్థాలు తింటే మలబద్ధకం తప్పదు

ABN , First Publish Date - 2023-02-21T14:19:04+05:30 IST

మన ఆహారపుటలవాట్లు అజీర్తి, మలబద్ధకం, కడుపు ఉబ్బరాలకు కారణమవుతాయి. కాబట్టి వాటి పట్ల అవగాహన ఏర్పరుచుకోవాలి.

Food : ఈ పదార్థాలు తింటే మలబద్ధకం తప్పదు
అవగాహన ఏర్పరుచుకోవాలి

మన ఆహారపుటలవాట్లు అజీర్తి, మలబద్ధకం, కడుపు ఉబ్బరాలకు కారణమవుతాయి. కాబట్టి వాటి పట్ల అవగాహన ఏర్పరుచుకోవాలి.

పచ్చి అరటి: పచ్చి అరటిపండ్లలో రెసిస్టెంట్‌ స్టార్చ్‌ ఉంటుంది. ఈ రకమైన డైటరీ ఫైబర్‌ను జీర్ణాశయం జీర్ణించుకోలేదు. దాంతో మలబద్ధకం వేధిస్తుంది. కాబట్టి పచ్చి, దోర అరటిపండ్లకు బదులుగా పండిన అరటిపండ్లు తినాలి.

చాక్లెట్‌: మిల్క్‌ చాక్లెట్లు మలబద్ధకాన్ని పెంచుతాయి. ఈ రకం చాక్లెట్లలోని కొవ్వులు జీర్ణశక్తిని కుంటుపరుస్తాయి. అలాగే పేగుల్లో ఆహార కదలికలను నియంత్రిస్తాయి. ఫలితంగా మలబద్ధకం మొదలవుతుంది. నిజానికి కోకో విత్తనాల పైపొర మలబద్ధకానికి విరుగుడుగా పని చేస్తుంది. కానీ వైట్‌ చాక్లెట్స్‌ తయారీలో పైపొట్టును తొలగించి ఉపయోగిస్తారు. కాబట్టి మలబద్ధకానికి దూరంగా ఉండాలంటే వైట్‌ చాక్లెట్లను తినడం తగ్గించాలి.

కెఫీన్‌: ఎనర్జీ డ్రింక్స్‌, బ్లాక్‌ కాఫీ, కాఫీ, హాట్‌ చాక్లెట్‌లలో కెఫీన్‌ ఉంటుంది. అధిక మోతాదుల్లో కెఫీన్‌ తీసుకుంటే, అది పెద్ద పేగుల్లోని నీటిని పీల్చుకుని, మలబద్ధకాన్ని పెంచుతుంది. పరిమిత పరిమాణాల్లో తీసుకున్నప్పుడు పేగుల్లోని కదలికలు పెరగడానికి తోడ్పడే కెఫీన్‌, పరిమితి మించితే మలబద్ధకాన్ని పెంచుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.

ఫ్రోజెన్‌ ఫుడ్‌/ప్రాసెస్డ్‌ ఫుడ్‌: వీటిలో ప్రిజర్వేటివ్స్‌, సోడియం, షుగర్‌ మోతాదులు, రుచిని పెంచే పదార్థాలు, రంగులూ ఎక్కువ. వీటన్నిటినీ జీర్ణం చేసుకోడానికి జీర్ణ వ్యవస్థ అవసరానికి మించి కష్టపడవలసి వస్తుంది. ఫలితంగా జీర్ణ వ్యవస్థ బలహీనపడి రకరకాల సమస్యలకు గురవుతుంది. వాటిలో ముఖ్యమైనది మలబద్ధకం. కాబట్టి ఇలాంటి పదార్థాలను ఎంతో పరిమితంగా తీసుకోవాలి.

Updated Date - 2023-02-21T14:19:06+05:30 IST