Share News

Brain Health: ఆహారం కాదండోయ్.. ఈ నాలుగు పనులు చేస్తే చాలు.. మెదడు యమా యాక్టీవ్!

ABN , Publish Date - Dec 25 , 2023 | 12:52 PM

మనిషి ఏ పని చేయాలన్నా మూడ్ మీద ఆధారపడి ఉంటుంది. మూడ్ బాగుండాలంటే మెదడు యాక్టీవ్ గా ఉండాలి. ఈ నాలుగు పనులు చేస్తే మెదడు సూపర్ యాక్టీవ్ అంతే..!

Brain Health: ఆహారం కాదండోయ్..  ఈ నాలుగు పనులు చేస్తే చాలు.. మెదడు యమా యాక్టీవ్!

మనిషి ఏ పని చేయాలన్నా మూడ్ మీద ఆధారపడి ఉంటుంది. మూడ్ బాగుంటే అన్ని పనులు చలాకీగా చేసేస్తారు. కానీ మూడ్ బాగోలేకుంటే అటు ఉన్న వస్తువు ఇటు పెట్టాలన్నా ఏదో తెలియని నిరాసక్తత, చిరాకు, నిర్లక్ష్యం చోటు చేసుకుంటాయి. అందరూ దీనికి బద్దకం అనే పేరు పెడతారు. కానీ అసలు విషయం ఏమిటంటే మెదడు ఉత్సాహంగా లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది.

మెదడు ఉత్సాహంగా ఉండటానికి ఆక్సిటోసిన్, డోపమైన, ఎండార్పిన్ వంటి న్యూరోట్రాన్స్ మీటర్లు సహాయపడతాయి. కానీ శరీరంలో ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ ఎక్కువగా ఉంటే పై న్యూరోట్రాన్స్ మీటర్లు విడుదల కావు. దీనివల్ల మెదడు మీద ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు వస్తాయి. చాలామంది మెదడుకు బూస్ట్ కావడం కోసం పోషకాహారాలు, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు కలిగిన ఆహారాలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఆహారమే కాదు.. ఈ నాలుగు పనులు చేస్తే కార్టిసాల్ హార్మోన్ నియంత్రణలోకి వచ్చి మెదడు యమా చురుగ్గా మారుతుంది.

ఇది కూడా చదవండి: శనగలు, బెల్లం.. ఈ సూపర్ కాంబినేషన్ తింటే కలిగే లాభాలివీ..!


ఇష్టమైన పనులు చేయడం వల్ల తృప్తి కలుగుతుంది. అభిరుచి ఉన్న కార్యకలాపాలలో పాల్గొనడం డోపమైన్ విడుదలలో సహాయపడుతుంది.

ఈమధ్యకాలంలో మైండ్ ఫుల్ నెస్ బాగా ప్రాచుర్యం పొందింది. సహజకాంతిని పొందడం, ప్రకృతిలో సమయాన్ని గడపడం, ఆహ్లాదకర వాతావారణంలో ఉండటం మొదలైనవి సెరోటోనిన్ ను పెంచడంలో సహాయపడతాయి.

సామాజిక కార్యక్రమాలు మనిషిలో ఒత్తిడిని తగ్గిస్తాయి. ప్రేమ, ఆప్యాయత, దయ కలిగిన వ్యక్తులను కలవడం వారితో కలసి ఇతరులకు సహాయం చేయడం వంటివి ఆక్సిటోసిన్ విడుదలకు సహాయపడతాయి.

ఇది కూడా చదవండి: Viral Video: గాలిలో చక్కర్లు కొడుతున్న పక్షిని చూసి అవాక్కవుతున్న నెటిజన్లు.. దీని రెక్కలు చూస్తే..!

శరీరానికి ఉల్లాసాన్ని పెంచే వినోదభరితమైన కార్యక్రమాలు, వ్యాయామాలు ఎండార్పిన్ ల విడుదలకు సహాయపడతాయి.

(గమనిక: ఇది ఆరోగ్య నిపుణులు, లైఫ్ స్టైల్ విశ్లేషకులు పలుచోట్ల అందించిన సమాచారం ప్రకారం రూపొందించిన కథనం. ఆరోగ్యం గురించి ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించడం మంచిది)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.


Updated Date - Dec 25 , 2023 | 12:52 PM