Banana: ఉదయాన్నే అరటిపండ్లు తినచ్చా? రోజూ అల్పాహారంలో వీటిని తింటే..
ABN , Publish Date - Dec 27 , 2023 | 02:30 PM
బాగా ఆకలిగా ఉన్నప్పుడు అరటిపండ్లు తింటే చాలాసేపు కడుపు నిండుగా ఉంటుంది. అయితే ఉదయాన్నే అల్పాహారంలో ఈ అరటిపండ్లను తింటే జరిగేదేంటంటే..
అరటిపండ్లు అన్ని వయసుల వారు తినదగిన పండు. ఇవి అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరలో ఉంటాయి. వీటిలో పోషకాలు, విటమిన్లు సమృద్దిగా ఉంటాయి. బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఓ రెండు అరటిపండ్లు తింటే దాదావు గంటకు పైగా ఆకలి మాటే దరిచేరదు. సాధారంగా అందరూ భోజనం తర్వాత లేదా ఆకలిగా అనిపించినప్పుడు మాత్రమే అరటిపండ్లు తింటుంటారు. కానీ రోజూ ఉదయాన్నే అల్పాహారంలో అరటిపండ్లు తినడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో తెలుసుకుంటే..
జీర్ణక్రియకు మంచిది..
అరటిపండ్లలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ప్రేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన గట్ ను ప్రోత్సహిస్తుంది. జీర్ణాశయాన్ని ఆరోగ్యగా ఉంచుతుంది.
ఇది కూాడా చదవండి: వెల్లుల్లి పొట్టు పడేస్తున్నారా? ఈ నిజాలు తెలిస్తే!
బరువు తగ్గడానికి..
అరటిపండ్లలో తక్కువ కేలరీలు ఉంటాయి. కేలరీల కంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది. దీని కారణంగా వీటిని తింటే కడుపు నిండిన ఫీల్ ఎక్కువసేపు ఉంటుంది. ఇది ఆకలిని నియంత్రించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యానికి..
అరటిపండ్లలో పొటాషియం కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. రక్తపోటు అదుపులో ఉంటే సాధారణంగానే గుండె మీద ఒత్తిడి తక్కువ ఉంటుంది. తద్వారా అరటిపండ్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి.
ఎనర్జీ బూస్టర్..
కార్బోహైడ్రేట్స్, సహజ చక్కెరల కారణంగా అరటిపండ్లు తక్షణ శక్తిని అందిస్తాయి. ఎక్కువ సేపు నిలకడగా శక్తిని విడుదల చేస్తాయి. దీని కారణంగా ఉదయాన్నే వీటిని తింటే శరీరానికి శక్తి లభిస్తుంది.
ఇది కూడా చదవండి: ఆవిరిమీద ఉడికించిన ఆహారం తింటే కలిగే లాభాల లిస్ట్ ఇదీ..!
మానసిక ఆరోగ్యం..
అరటిపండ్లలో ట్రెప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది సెరోటినిన్ గా మార్పు చెందుతుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది.
పోషకాలు..
అరటిపండ్లలో పొటాషియం, విటమిన్-సి, విటమిన్-బి6, డైటరీ ఫైబర్ వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే అల్పాహారంలో అరటిపండ్లు తీసుకుంటే మంచి ఉత్సాహంతో రోజు మొదలవుతుంది.
ఇది కూడా చదవండి: Dates: రోజూ ఖర్జూరం తింటే జరిగేదేంటి? ఈ కారణాల లిస్ట్ చూస్తే..!
చక్కెర స్థాయిలు..
అరటిపండ్లలో చక్కెరలు ఉన్నా ఇవి సహజ చక్కెరలు. పైగా అరటిపండ్లలో గ్లైసెమిక్ సూచిక మధ్యస్థంగా ఉంటుంది. అంటే ఇవి నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు మెల్లగా విడుదల కావడానికి సహాయపడుతుంది.
వ్యాధులు రాకుండా చేస్తుంది..
సమతుల్య ఆహారంలో అరటిపండ్లకు కూడా స్థానం ఉంది. వీటిని క్రమం తప్పకుండా అల్పాహారంగా తీసుకుంటే గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
ఇది కూడా చదవండి: Nutmeg: వంటల్లో వాడే జాజికాయ గురించి ఈ షాకింగ్ నిజాలు తెలుసా? రోజూ చిటికెడు పొడిని తింటే..!
(గమనిక: ఇది ఆహార నిపుణులు, వైద్యులు పలుచోట్ల పేర్కొన్న అంశాల ఆధారంగా రూపొందించబడిన కథనం. ఆరోగ్యం గురించి ఏమైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించడం మంచిది)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.