Karnataka Exit Polls: కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇలా ఉన్నాయేంటి..!

ABN , First Publish Date - 2023-05-10T19:18:17+05:30 IST

కర్ణాటక ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ (Karnataka Exit Polls) ఇప్పటికే వచ్చేశాయి. మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ వార్ వన్‌సైడేనని, కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యమని చెప్పుకొచ్చాయి.

Karnataka Exit Polls: కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇలా ఉన్నాయేంటి..!

బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల (Karnataka Elections) పోలింగ్‌ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 66 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో 72 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. కర్ణాటక ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ (Karnataka Exit Polls) ఇప్పటికే వచ్చేశాయి. మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ వార్ వన్‌సైడేనని, కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యమని చెప్పుకొచ్చాయి. ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్ కర్ణాటకలో కాంగ్రెస్‌కే పట్టం కట్టింది. కాంగ్రెస్‌‌కు 117-124, బీజేపీ 83-94, జేడీఎస్ 23-30 స్థానాలు దక్కే అవకాశం ఉందని ఈ సర్వే సంస్థ జోస్యం చెప్పింది. కాంగ్రెస్‌ 42.5%, బీజేపీ 34.5%, జేడీఎస్ 16% ఓట్ షేర్ ఉంటుందని తెలిపింది.

FtAO4RSWYAA7wUY.jpg

బెంగళూరు అర్బన్, ఓల్డ్ మైసూరు, ముంబై కర్ణాటకలో కాంగ్రెస్‌కు ఆధిక్యం వచ్చే అవకాశం ఉందని.. కోస్టల్ కర్ణాటకలో బీజేపీకి ఆధిక్యం దక్కే ఛాన్స్ ఉందని ఆత్మసాక్షి సంస్థ పేర్కొంది. సిద్ధరామయ్య, శివకుమార్, ఖర్గే నాయకత్వంపై కన్నడ ఓటర్లు నమ్మకం పెట్టుకున్నారని ఈ సంస్థ చెప్పుకొచ్చింది. మోదీ క్లీన్‌ ఇమేజ్‌పై బీజేపీ అభిమానుల విశ్వాసం కమలంకు కలిసొచ్చే అంశంగా తేల్చింది. యువ ఓటర్లలో బీజేపీ, కాంగ్రెస్ పోటా పోటీగా తలపడనున్నాయని, నలభై ఏళ్లు దాటిన ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లుగా ఆత్మసాక్షి సర్వే సంస్థ పేర్కొంది.

Fvr8gdaaUAAjhso.jpg

వివిధ సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు:

పీపుల్స్ పల్స్ : కాంగ్రెస్ 107 -119, బీజేపీ 78-80,జేడీఎస్ 23-29

ఓట్ షేర్: కాంగ్రెస్ 42 శాతం , బీజేపీ 36 శాతం, జేడీఎస్ 16 శాతం

న్యూస్ నేషన్-సీజీఎస్: కాంగ్రెస్-86, బీజేపీ-114, జేడీఎస్-21, ఇతరులు-3

సువర్ణ న్యూస్-జన్‌ కీ బాత్: కాంగ్రెస్ 91-106, బీజేపీ 94-117, జేడీఎస్ 14-24, ఇతరులు 0-2

రిపబ్లిక్ టీవీ-పీ మార్క్యూ: కాంగ్రెస్ 94-108, బీజేపీ 85-100, జేడీఎస్ 24-32, ఇతరులు 2-6

జీ న్యూస్-మ్యాట్రిజ్: కాంగ్రెస్ 103-118, బీజేపీ 79-94, జేడీఎస్ 25-33, ఇతరులు 2-5

టీవీ9 భరత్‌వర్ష్-పోల్‌స్ట్రాట్: కాంగ్రెస్ 99-109, బీజేపీ 88-98, జేడీఎస్ 21-26, ఇతరులు 0-4

ఏబీపీ-సీఓటర్: బీజేపీ 66-86, కాంగ్రెస్ 81-101, జేడీఎస్ 20-27, ఇతరులు 0-3

పోల్ ఆఫ్ పోల్స్: కాంగ్రెస్ 103, బీజేపీ 94

karnataka-polls.jpg

మొత్తంగా ఇప్పటిదాకా వెల్లడైన ఎగ్జిట్‌పోల్స్‌ను ఒక్కసారి పరిశీలిస్తే.. 3 ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌కు అధికారం దక్కుతుందని అంచనా వేయగా, రెండు ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని.. అయితే హంగ్ ఏర్పడే అవకాశమూ లేకపోలేదని అంచనా వేయడం గమనార్హం. అధికార బీజేపీపై ‘40 శాతం కమీషన్ సర్కార్’ అని కాంగ్రెస్ చేసిన ఆరోపణలు ఎన్నికల్లో ప్రభావం చూపాయని ఎగ్జిట్ పోల్ సంస్థలు అభిప్రాయపడ్డాయి. మొత్తంగా చూసుకుంటే.. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ మధ్య చాలా స్థానాల్లో త్రిముఖ పోరు తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పరిశీలిస్తే స్పష్టమైంది.

KARNATAKA1.jpg

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చూస్తుంటే జేడీఎస్ కింగ్‌మేకర్ అయ్యే ఛాన్స్ ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అన్ని సందర్భాల్లో నిజం కాలేదని పలుమార్లు ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయిన పరిస్థితి కూడా గతంలో ఉంది. అందువల్ల.. ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అధికారికంగా వెల్లడయ్యే ఫలితాలకు దగ్గరగా ఉంటాయని చెప్పలేం. అలా అని పూర్తి స్థాయిలో ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలనూ కొట్టిపారేయలేం. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే కావాల్సిన మేజిక్ ఫిగర్ 113.

Updated Date - 2023-05-10T19:32:10+05:30 IST