Karnataka Exit Polls: కుమారస్వామికి మళ్లీ కలిసొచ్చేలానే ఉందిగా.. ఇలా ఎందుకు అనిపిస్తుందంటే..

ABN , First Publish Date - 2023-05-10T20:56:14+05:30 IST

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉంది గానీ హంగ్ ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదని తేలిపోయింది. హంగ్ ఏర్పడే పరిస్థితే తలెత్తితే.. కర్ణాటకలో జేడీఎస్ అగ్ర నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మరోసారి కింగ్ మేకర్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.

Karnataka Exit Polls: కుమారస్వామికి మళ్లీ కలిసొచ్చేలానే ఉందిగా.. ఇలా ఎందుకు అనిపిస్తుందంటే..

బెంగళూరు: దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. గెలుపు కోసం కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ హోరాహోరీగా ప్రచారం చేశాయి. ఈసీ ఎంత కట్టడి చేసినా కోట్లకు కోట్లు డబ్బు పంపిణీ జరిగిందని సమాచారం. మూడు పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని ఏకైక పెద్ద పార్టీగా అవతరిస్తుందని చెప్పుకొచ్చాయి. అయితే.. కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తున్నట్లుగా 150 అసెంబ్లీ స్థానాలు హస్తం పార్టీ చేజిక్కించుకుంటుందని ఏ ఎగ్జిట్‌పోల్ అంచనాలు లేకపోవడం గమనార్హం.

FntcDpWaAAA39aY.jpg

ఒక్క ‘ఇండియా టుడే-యాక్సిక్ మై ఇండియా’ (India Today Axis My India) ఎగ్జిట్ పోల్ మాత్రం కాంగ్రెస్‌ 122 నుంచి 140 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. బీజేపీ 62-80, జేడీఎస్‌కు 20-25 స్థానాలు రావొచ్చని ఈ సర్వే అంచనా వేయడం గమనార్హం. ఇక.. ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన మిగిలిన సర్వే సంస్థల్లో మెజార్టీ సంస్థలు మేజిక్ ఫిగర్ అయిన 113 స్థానాలకు కాంగ్రెస్ ఒక పది అటో,ఇటో గెలవబోతోందని అంచనా వేశాయి.

ForB3oNaEAAr-9j.jpg

ఒక్క ముక్కలో చెప్పాలంటే.. 110 నుంచి 120 స్థానాల మధ్యలో కర్ణాటకలో కాంగ్రెస్ జెండా ఎగరనుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పుకొచ్చాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిశితంగా పరిశీలిస్తే.. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉంది గానీ హంగ్ ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదని తేలిపోయింది. హంగ్ ఏర్పడే పరిస్థితే తలెత్తితే.. కర్ణాటకలో జేడీఎస్ అగ్ర నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మరోసారి కింగ్ మేకర్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.

FtAO4RSWYAA7wUY.jpg

గతంలో కూడా సంకీర్ణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా కుమారస్వామి పనిచేసిన సంగతి తెలిసిందే. నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆ సందర్భంలో కుమారస్వామి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక.. కుమారస్వామి పోటీ చేసిన నియోజకవర్గం విషయానికొస్తే.. మాజీ సీఎం, జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామికి చెన్నపట్న పెట్టని కోట. 2004 నుంచీ ఇక్కడ ఆయన పరాజయం ఎరుగరు. వొక్కళిగ నేత అయిన కుమారస్వామి ఈ సారి అదే వర్గానికి చెందిన బీజేపీ నేత, మంత్రి సీపీ యోగేశ్వర నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్‌ నుంచి ఎస్‌.గంగాధర్‌ ఇక్కడ పోటీ చేశారు.

Updated Date - 2023-05-10T20:56:52+05:30 IST