లక్షకు పైగా జీతంతో షార్‌ శ్రీహరికోటలో పోస్టులు

ABN , First Publish Date - 2023-05-01T12:41:09+05:30 IST

శ్రీహరికోట(తిరుపతి జిల్లా)లోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌...కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

లక్షకు పైగా జీతంతో షార్‌ శ్రీహరికోటలో పోస్టులు
Posts

శ్రీహరికోట(తిరుపతి జిల్లా)లోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌...కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 94

1. టెక్నీషియన్‌ అసిస్టెంట్‌ : 12 పోస్టులు

విభాగాలు: సినిమాటోగ్రఫీ/ఫొటోగ్రఫీ, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌ ఇంజనీరింగ్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌

2. లైబ్రరీ అసిస్టెంట్‌- ఎ: 2 పోస్టులు

3. సైంటిఫిక్‌ అసిస్టెంట్‌: 6 పోస్టులు

విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌, ఫిజిక్స్‌

4. టెక్నీషియన్‌-బి/డ్రా్‌ఫ్ట్సమెన్‌ - బి: 74 పోస్టులు

విభాగాలు: కెమికల్‌, ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, మెషినిస్ట్‌, ఎలకా్ట్రనిక్‌ మెకానిక్‌, డీజిల్‌ మెకానిక్‌, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌, ప్లంబర్‌, ఆపరేటర్‌ కమ్‌ మెకానిక్‌, హెచ్‌వీడీ లైసెన్స్‌డ్‌ డీజిల్‌ మెకానిక్‌, రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండిషనింగ్‌, సివిల్‌, మెకానికల్‌.

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ/ఎన్‌టీసీ/ఎన్‌ఏసీ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 2023 మే 16 నాటికి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: నెలకు టెక్నికల్‌ అసిస్టెంట్‌/సైంటిఫిక్‌ అసిస్టెంట్‌/లైబ్రరీ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.44,900 - రూ.1,42,400; టెక్నీషియన్‌/డ్రాఫ్ట్స్‌మెన్‌ పోస్టులకు రూ.21,700-రూ.69,100.

దరఖాస్తు ఫీజు: పోస్టును అనుసరించి రూ.600, రూ.1000 చెల్లించాలి

ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్‌

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: మే 16

ఫీజె చెల్లింపునకు చివరి తేదీ: మే 17

వెబ్‌సైట్‌: https://www.shar.gov.in/sdscshar/ index.jsp

Updated Date - 2023-05-01T12:41:09+05:30 IST