Mulugu Forest Collegeలో పీహెచ్‌డీ

ABN , First Publish Date - 2023-01-25T16:21:31+05:30 IST

ములుగు (సిద్దిపేట్‌ జిల్లా)లోని ఫారెస్ట్‌ కాలేజ్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (Forest College and Research Institute) (ఎఫ్‌సీఆర్‌ఐ)-పీహెచ్‌డీ ఫారెస్ట్రీ ప్రోగ్రామ్‌ (PhD Forestry Programme)లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. అకడమిక్‌

Mulugu Forest Collegeలో పీహెచ్‌డీ
పీహెచ్‌డీ

ములుగు (సిద్దిపేట్‌ జిల్లా)లోని ఫారెస్ట్‌ కాలేజ్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (Forest College and Research Institute) (ఎఫ్‌సీఆర్‌ఐ)-పీహెచ్‌డీ ఫారెస్ట్రీ ప్రోగ్రామ్‌ (PhD Forestry Programme)లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. అకడమిక్‌ మెరిట్‌, ఐకార్‌-ఏఐసీఈ-జేఆర్‌ఎఫ్/ఎస్‌ఆర్‌ఎఫ్‌ (పీహెచ్‌డీ) 2022 స్కోర్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

అర్హత: ఐకార్‌/ యూజీసీ (UGC) గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి నాలుగేళ్ల బీఎస్సీ ఆనర్స్‌ ఫారెస్ట్రీ డిగ్రీతోపాటు రెండేళ్ల ఎమ్మెస్సీ ఫారెస్ట్రీ పూర్తిచేసి ఉండాలి. ఐకార్‌-ఏఐసీఈ-జేఆర్‌ఎఫ్/ఎస్‌ఆర్‌ఎఫ్‌ (పీహెచ్‌డీ) 2022 అర్హత తప్పనిసరి.

ఎంపిక: ఎమ్మెస్సీ మార్కులకు 40 శాతం, ఐకార్‌ ఎంట్రెన్స్‌ స్కోర్‌కు 40 శాతం, ఇంటర్వ్యూ స్కోర్‌ (పబ్లికేషన్స్‌, అవార్డులు, మెడల్స్‌, ఫెలోషిప్స్‌, రిసెర్చ్‌ అనుభవం సహా)నకు 20 శాతం వెయిటేజీ ఇస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.2,000; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1000

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 29

డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన్‌, ఇంటర్వ్యూలు: ఫిబ్రవరి 3

ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల: ఫిబ్రవరి 4

ప్రోగ్రామ్‌ రిజిస్ట్రేషన్‌, ఫీజు చెల్లింపులు: ఫిబ్రవరి 9

ప్రోగ్రామ్‌ ప్రారంభం: ఫిబ్రవరి 15

వెబ్‌సైట్‌: fcrits.in

Updated Date - 2023-01-25T16:21:31+05:30 IST