Share News

Social Media Star: ఇద్దరు భార్యలు.. ఆరుగురు ప్రియురాళ్లు.. ఈ సోషల్ మీడియా స్టార్‌ అరెస్ట్ వెనుక పెద్ద కథే ఉంది..!

ABN , First Publish Date - 2023-11-30T15:25:09+05:30 IST

ఈ ఫొటోలోని వ్యక్తికి సరిగ్గా 41 ఏళ్లు. ఇద్దరు భార్యలు. తొమ్మిది మంది పిల్లలు. అంతటితో మనోడు ఆగలేదండోయ్. అతడి చుట్టూ ఎప్పుడూ ఆరుగురు ప్రియురాళ్లు ఉంటూనే ఉంటారు. జల్సా లైఫ్‌ను ఎంజాయ్ చేయడానికి అతడేమీ రాయల్ ఫ్యామిలీ నుంచి రాలేదండోయ్. అతడి కథేంటంటే..!

Social Media Star: ఇద్దరు భార్యలు.. ఆరుగురు ప్రియురాళ్లు.. ఈ సోషల్ మీడియా స్టార్‌ అరెస్ట్ వెనుక పెద్ద కథే ఉంది..!

ముంబై: ఈ ఫొటోలోని వ్యక్తికి సరిగ్గా 41 ఏళ్లు. ఇతడికి ఇద్దరు భార్యలు. తొమ్మిది మంది పిల్లలు కూడా. అంతటితో మనోడు ఆగలేదండోయ్. అతడి చుట్టూ ఎప్పుడూ ఆరుగురు ప్రియురాళ్లు ఉంటూనే ఉంటారు. భార్యలు, ప్రియురాళ్లతో జల్సా లైఫ్‌ను ఎంజాయ్ చేయడానికి అతడేమీ రాయల్ ఫ్యామిలీ నుంచి రాలేదండోయ్. తల్లిదండ్రులు నిరుపేదలే అయినా.. ఇప్పుడు అతడు మాత్రం లగ్జరీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. విదేశాల్లో టూర్లకు కూడా వెళ్లే ఇతడు చదివింది కేవలం ఆరో తరగతి మాత్రమే. మరి అతడికి ఇంత డబ్బు ఎలా వచ్చింది..? పోలీసులు అతడిని ఎందుకు అరెస్ట్ చేశారన్న వివరాల్లోకి వెళ్తే..

ముంబైకి చెందిన అజిత్‌ మౌర్యకు 20 ఏళ్ల క్రితమే సంగీత అనే మహిళతో పెళ్లయింది. ఆ జంటకు ఏడుగురు సంతానం. అయితే తక్కువ కాలంలోనే ఎక్కువ డబ్బు సంపాదించాలన్నది అజిత్ కల. అందుకోసం అడ్డదారులు తొక్కసాగాడు. చదివింది ఆరో తరగతి వరకే అయినా అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించే విషయంలో మాత్రం అతడు దిట్టే. చిన్నా చితకా దొంగతనాలు, నేరాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ వచ్చిన అజిత్ 2016వ సంవత్సరంలో తనది కాని భూమిని తనదేనని నమ్మించి వేరే వాళ్లకు అమ్మేశాడు. అదే దారిలో డబ్బు సంపాదన మొదలు పెట్టాడు. 2018వ సంవత్సరంలో అతడికి సుశీల అనే మహిళ పరిచయమయింది. ఇద్దరూ కలిసి నకిలీ కరెన్సీ బిజినెస్ మొదలు పెట్టారు. అది వారికి ఊహించనంత లాభాలను తెచ్చిపెట్టింది. 2019వ సంవత్సరంలో సుశీలను అజిత్ రెండో పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు కూడా కలిగారు.

అజిత్ అక్రమ వ్యాపారాల వల్ల భారీగా డబ్బును కూడబెట్టాడు. ఇద్దరు భార్యలకు ముంబైలోనే రెండు లగ్జరీ ఇళ్లను కొన్నాడు. అంతే కాదు.. అతడు ప్రత్యేకంగా ఓ లగ్జరీ అపార్ట్మెంట్‌లో అద్దెకు ఉంటున్నాడు. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ పాపులారిటీని సంపాదించాడు. అయితే అంతా బాగానే ఉంది కానీ.. ముంబైకి చెందిన ధర్మేంద్ర కుమార్ అనే వ్యక్తిని మోసం చేయడంతో మనోడి నిర్వాకాలు అన్నీ ఒకేసారి బయటపడ్డాయి. మూడు లక్షల రూపాయలు ఇస్తే నెలలో దాన్ని రెట్టింపు చేస్తానంటూ నమ్మించి మోసం చేశాడు. దీంతో అజిత్‌పై ధర్మేంద్ర కుమార్ కేసు పెట్టాడు.

దీంతో పోలీసుల దృష్టి అజిత్‌పై పడింది. అతడి గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు. పెద్దగా చదివిందేమీ లేకున్నా కోట్లకు కోట్ల రూపాయల ఆస్తి ఉండటంతో పోలీసులకు మరింత అనుమానం కలిగింది. అతడి ఫోన్‌కాల్స్‌ వివరాలను తెప్పించుకున్నారు. ఆరుగురు ప్రియురాళ్లతో జల్సాలు చేస్తూ.. డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్న అతడి నిర్వాకాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడసాగాయి. మొత్తానికి అన్ని ఆధారాలను సేకరించిన సరోజినీ నగర్ పోలీసులు బుధవారం అతడిని అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా స్టార్ వెనుక ఇంత కథ ఉందా అని నెటిజన్లు అవాక్కవుతున్నారు.

Updated Date - 2023-11-30T15:25:11+05:30 IST