Mumbai Makeup Artist: మేకప్ ఆర్టిస్ట్ ప్రాణాలను బలిగొన్న ‘ప్రేమ’.. అసలేం జరిగిందంటే?

ABN , First Publish Date - 2023-09-12T22:05:37+05:30 IST

ఈ తరంలో ప్రేమ అనేది మూణ్నాళ్ల ముచ్చటగా మారిపోయింది. స్వచ్ఛమైన ప్రేమ అనేది కనిపించడం లేదు. ప్రేమించుకున్నామా.. శారీరక సుఖం పొందామా.. విడిపోయామా.. అన్నట్టుగా నేటి లవ్ స్టోరీలు...

Mumbai Makeup Artist: మేకప్ ఆర్టిస్ట్ ప్రాణాలను బలిగొన్న ‘ప్రేమ’.. అసలేం జరిగిందంటే?

ఈ తరంలో ప్రేమ అనేది మూణ్నాళ్ల ముచ్చటగా మారిపోయింది. స్వచ్ఛమైన ప్రేమ అనేది కనిపించడం లేదు. ప్రేమించుకున్నామా.. శారీరక సుఖం పొందామా.. విడిపోయామా.. అన్నట్టుగా నేటి లవ్ స్టోరీలు తయారయ్యాయి. కొందరైతే కేవలం శారీరక సుఖం పొందడం కోసం ‘ప్రేమ’ అనే రెండు అక్షరాలను అడ్డం పెట్టుకుంటున్నారు. తీరా కోరిక తీరిన తర్వాత వదిలేసి వెళ్లిపోతున్నారు. ఒకవేళ వాళ్లు తమ వెంట పడుతూనే ఉంటే.. వాళ్లను వదిలించుకోవడానికి రకరకాల మార్గాల్ని అనుసరిస్తూ ఉంటారు. కొందరు చంపడానికి కూడా వెనుకాడరు. ఇప్పుడు ఓ దుర్మార్గుడు కూడా అదే పని చేశాడు. ప్రేమ పేరుతో ఓ యువతిని అన్ని విధాలుగా వాడుకున్న ఆ కీచకుడు.. ఆమెను కిరాతకంగా చంపేశాడు. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..


మేకప్ ఆర్టిస్ట్ నైనా మహత్‌ (29)కు ఐదేళ్ల క్రితం మనోహర్ శుక్లా (43)తో పరిచయం ఏర్పడింది. మనోహర్‌కు అప్పటికే పెళ్లయి, పిల్లలు ఉన్నప్పటికీ.. నైనాతో సన్నిహితంగా మెలిగాడు. నైనా కూడా క్రమంగా అతనికి దగ్గరైంది. ఇక అప్పటి నుంచి ఇద్దరూ తమ ప్రేమాయణం కొనసాగించారు. వీరి ఎఫైర్ గురించి అటు మనోహర్ కుటుంబానికి, ఇటు నైనా ఫ్యామిలీకి తెలుసు. ఎన్నిసార్లు వారించినా.. వాళ్లిద్దరు వినకుండా తమ ఎఫైర్ నడిపారు. కట్ చేస్తే.. ఆగస్టు 12వ తేదీన నైనా కుటుంబ సభ్యులు నైగావ్ పోలీసుల్ని ఆశ్రయించారు. ఆమె ఫోన్ స్విచ్చాఫ్ వస్తోందని, తమకేదో అనుమానంగా ఉందని ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి.. నైనా నివాసం ఉండే సన్‌టెక్ కాంప్లెక్స్‌లో తనిఖీ నిర్వహించారు. ఆ కాంప్లెక్స్‌లో ఉండే సీసీటీవీని పరిశీలించగా.. మనోహర్‌తో పాటు అతని భార్య సూట్‌కేసుతో బయలుదేరడాన్ని గుర్తించారు.

ఈ సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు మంగళవారం శుక్లాని అరెస్ట్ చేశారు. అతడ్ని విచారించగా.. తమ ఎఫైర్ గురించి తన భార్యకు తెలిసినప్పటి నుంచి తాను నైనా మహత్‌కి బ్రేకప్ చెప్పానన్నాడు. కానీ.. మహత్ మాత్రం పెళ్లి చేసుకోవాలని తనని ఒత్తిడి చేసేదని, లేకపోతే అత్యాచారం కేసు పెడతానని బెదిరింపులకు పాల్పడేదని చెప్పాడు. దీంతో మరోదారి లేక తాను మహత్‌ని హతమార్చానని తన నేరం అంగీకరించాడు. మరోవైపు.. మహత్ మృతదేహం వల్సద్ క్రీక్‌లో ఒక సూట్‌కేసులో లభ్యమైంది. అక్కడిదాకా ఆమె మృతదేహాన్ని ఎలా తీసుకెళ్లారనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. అటు.. తమ కూతురిని ప్రేమ పేరుతో వంచించి, ఇప్పుడు చంపేసిన మనోహర్ శుక్లాని కఠినంగా శిక్షించాలని నైనా మహత్ పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2023-09-12T22:05:37+05:30 IST