Hyderabad : తండ్రిని గొంతుకోసి చంపిన కూతురు.. కారణమేంటో తెలిస్తే..?

ABN , First Publish Date - 2023-07-30T16:41:19+05:30 IST

నవ మాసాలు మోసి, కని..పెంచి పోషించిన తల్లిదండ్రులపైనే (Parents) కొందరు పిల్లలు క్రూరంగా ప్రవర్తిస్తున్నారు.! ఇటీవల కాలంలో తల్లిదండ్రులను బిడ్డలు చంపుతున్న ఘటనలో తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ఎక్కువగా జరుగుతున్నాయి.!

Hyderabad : తండ్రిని గొంతుకోసి చంపిన కూతురు.. కారణమేంటో తెలిస్తే..?

నవ మాసాలు మోసి, కని..పెంచి పోషించిన తల్లిదండ్రులపైనే (Parents) కొందరు పిల్లలు క్రూరంగా ప్రవర్తిస్తున్నారు.! ఇటీవల కాలంలో తల్లిదండ్రులను బిడ్డలు చంపుతున్న ఘటనలో తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ఎక్కువగా జరుగుతున్నాయి.! తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లల బాగు కోసమే ఆలోచిస్తుంటారు. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని పనులకు దూరంగా ఉండాలని.. మరికొన్ని అసలు చేయొద్దంటూ హద్దులు కూడా పెడతారు. కానీ.. అలా హద్దులు పెట్టడంపై పిల్లలు (Childrens) అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆగ్రహావేశాలకు లోనై క్షణికావేశంలో దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా.. పనికెళ్లి రాత్రిపూట ఎందుకు ఆలస్యంగా వస్తున్నావని అడిగిన తండ్రిని క్రూరంగా హత్య (Murder) చేసి చంపిందో కుమార్తె. ఈ హృదయ విదారక ఘటన హైదరాబాద్‌లోని (Hyderabad) అంబర్‌పేట, తులసీరామ్‌నగర్‌లో చోటుచేసుకుంది.


Father-Dead.jpg

అసలేం జరిగింది..?

జగదీష్ అనే వ్యక్తి కుమార్తె నిఖితతో కలిసి అంబర్‌పేటలో నివసిస్తున్నారు. తండ్రి కూలి పనులకు వెళ్తుండగా.. కుమార్తె అఫ్జల్‌గంజ్‌లోని ఓ దుకాణంలో పనిచేస్తోంది. ఇలా ఇద్దరు పని చేస్తే పూట గడిచేది. వయసు మీదికొచ్చిన తండ్రిని బాగా చూసుకోవాల్సిన కుమార్తె.. కాటికి పంపంది!. డ్యూటీకి వెళ్లిన కుమార్తె టైమ్‌కు ఇంటికి రాకుండా రోజూ ఆలస్యంగా వస్తుండేది. ఒక్కోరోజు అర్ధరాత్రుల్లో కూడా ఇంటికి వచ్చేది. శనివారం నాడు రాత్రి 12 గంటల ప్రాంతంలో కుమార్తె ఇంటికి రావడంతో ఎందుకిలా ప్రతిరోజూ ఆలస్యంగా వస్తున్నావ్..? ఎన్నిగంటలకు డ్యూటీ అయిపోయింది..? ఇంటికి ఎన్నిగంటలకు వస్తున్నావ్..? అని తండ్రి నిలదీశాడు. ఇలా ప్రశ్నించడమే తండ్రి చేసిన పెద్ద తప్పయ్యింది.

తననే ప్రశ్నిస్తావా..? ఎక్కడికెళ్తే నీకెందుకు..? అంటూ జవాబిచ్చింది కుమార్తె. ఇలా ఇద్దరి మధ్యా మాట మాటా పెరిగింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన కుమార్తె.. పగిలిన అద్దం ముక్కతో తండ్రి గొంతులో గుచ్చింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. విషయం తెలుసుకున్న స్థానికులు అతడ్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రాత్రి నుంచి చికిత్స తీసుకున్న జగదీష్ ఆదివారం నాడు కన్నుమూశాడు. స్థానికుల సహకారంతో నిఖితను అరెస్ట్ చేసిన పోలీసులు.. పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తండ్రి మందలించాడనే కోపంతోనే ఇలా చేసినట్లు పోలీసు విచారణలో నిఖిత ఒప్పుకుంది.

Ambarpet.jpg


ఇవి కూడా చదవండి


Harassment : మహిళా ఉద్యోగినిపై కన్నేసిన సీఐడీ ఎస్పీ.. వాట్సాప్ చాటింగ్ చూశారో..!?


Hyderabad : హైదరాబాద్‌లో అర్ధరాత్రి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన 13 మంది మహిళలు.. అవాక్కయిన పోలీసులు!


Hyderabad : ఒక్కసారిగా పెరిగిన సీజనల్ వ్యాధులు.. మంచం పట్టిన భాగ్యనగరం!


Updated Date - 2023-07-30T16:42:50+05:30 IST