Harassment : మహిళా ఉద్యోగినిపై కన్నేసిన సీఐడీ ఎస్పీ.. వాట్సాప్ చాటింగ్ చూశారో..!?

ABN , First Publish Date - 2023-07-30T16:03:45+05:30 IST

రక్షించాల్సిన పోలీసులే (TS Police) భక్షిస్తున్నారు..! కంటికి రెప్పలా కాపాడుతాం.. మేం ఫ్రెండ్లీ పోలీసులు (Friendly Police) అని చెబుతున్న కొందరు ఖాకీలు కీచకులుగా మారుతున్నారు.! దీంతో యావత్ పోలీస్ శాఖకే (Police Dept) మాయని మచ్చ వచ్చిపడుతోంది.! ఇందుకు హైదరాబాద్‌లోని కొత్తపేట పరిధిలోని చైతన్యపురిలో జరిగిన ఘటనే ఉదాహరణ..

Harassment : మహిళా ఉద్యోగినిపై కన్నేసిన సీఐడీ ఎస్పీ.. వాట్సాప్ చాటింగ్ చూశారో..!?

రక్షించాల్సిన పోలీసులే (TS Police) భక్షిస్తున్నారు..! కంటికి రెప్పలా కాపాడుతాం.. మేం ఫ్రెండ్లీ పోలీసులు (Friendly Police) అని చెబుతున్న కొందరు ఖాకీలు కీచకులుగా మారుతున్నారు.! దీంతో యావత్ పోలీస్ శాఖకే (Police Dept) మాయని మచ్చ వచ్చిపడుతోంది.! ఇందుకు హైదరాబాద్‌లోని కొత్తపేట పరిధిలోని చైతన్యపురిలో జరిగిన ఘటనే ఉదాహరణ.


Harassment.jpg

అసలేం జరిగిందంటే..

కొత్తపేట పరిధిలోని చైతన్యపురికి చెందిన టీఎస్ఎస్‌పీడీసీఎల్ (TSSPDCL) సీనియర్ మహిళా అసిస్టెంట్‌‌ను గత కొన్నిరోజులుగా సీఐడీ ఎస్పీ కిషన్ సింగ్ నుంచి వేధింపులు ఎదురువుతున్నాయి. ఈ ఘటనతో విసిగిపోయిన ఆ మహిళా అధికారిణి పోలీసులను ఆశ్రయించారు. సీఐడీ ఎస్పీపై కేసు నమోదు చేసిన చైతన్యపురి పోలీసులు విచారణ చేపట్టారు. కాగా.. సరూర్ నగర్ స్టేడియంలో నేషనల్ కాంపిటీషన్స్‌కు మహిళ చదువుకుంటూ ఉండేవారు. ఆ టైమ్‌లో డీఎస్పీగా కిషన్ సింగ్ ఉన్నారు. ఆ టైమ్‌లో మహిళపై కిషన్ సింగ్ కన్నేసినట్లు తెలుస్తోంది.! తాను స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నానని.. వాటిలో పాల్గొనాలని అంటూ మహిళా ఉద్యోగినికి చెప్పినట్లుగా తెలుస్తోంది. అలా చిన్నగా దగ్గరై.. ఆ తరువాత మహిళ ఫోన్ నంబర్ తీసుకుని తరచూ ఆమెకు అభ్యంతరకర మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలు ఎస్పీ పంపించారు. పదేపదే.. ‘నిన్ను చీరలో చూడాలని ఉంది.. నీ ఫోటోలు పంపు’ అంటూ తరచూ వేదింపులకు గురిచేస్తుండేవాడని ఫిర్యాదులో మహిళ పేర్కొన్నారు. వాట్సాప్ చాటింగ్‌ను స్క్రీన్ షాట్లుగా తీసి పోలీసులకు ఆధారాలు సమర్పించారు.

DSP-MSG.jpg

ఎలాంటి చర్యలు ఉంటాయో..?

ఒక కేసు విషయంలో ఎస్పీని సంప్రదించగా.. తనకు సహకరించాలంటూ వేధింపులు మరింత ఎక్కువయ్యాయని సదరు మహిళ చెబుతున్నారు. అయితే.. మహిళా ఉద్యోగికి ఎస్పీ కిషన్ సింగ్ 2020 లో మార్నింగ్ వాక్‌లో పరిచయం అయినట్లుగా తెలుస్తోంది. ఇలా పదే పదే వేధిస్తుండటంతో తట్టుకోలేక పోలీసులకు మహిళ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఆ మహిళకు న్యాయం చేయాల్సిందేనని లేకుండా సీఐడీ ఆఫీసును ముట్టడిస్తామని మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


ఇవి కూడా చదవండి


Hyderabad : హైదరాబాద్‌లో అర్ధరాత్రి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన 13 మంది మహిళలు.. అవాక్కయిన పోలీసులు!


Hyderabad : ఒక్కసారిగా పెరిగిన సీజనల్ వ్యాధులు.. మంచం పట్టిన భాగ్యనగరం!


Updated Date - 2023-07-30T16:07:07+05:30 IST