Extra money: అదనపు ఆదాయం కావాలనుకుంటున్నారా? ఇవి చేయండి..

ABN , First Publish Date - 2023-01-22T21:10:15+05:30 IST

‘పైసామే పరమాత్మ’ అనే నానుడి దాదాపు అందరికీ అనుభవపూర్వకమే. డబ్బు (money) లేకుంటే బతుకుబండి నడవడం చాలాకష్టం. ప్రస్తుత రోజుల్లో ఖర్చులు అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ఆదాయాన్ని (Income) కూడా మెరుగుపరచుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.

Extra money: అదనపు ఆదాయం కావాలనుకుంటున్నారా? ఇవి చేయండి..

‘పైసామే పరమాత్మ’ అనే నానుడి దాదాపు అందరికీ అనుభవపూర్వకమే. డబ్బు (money) లేకుంటే బతుకుబండి నడవడం చాలాకష్టం. ప్రస్తుత రోజుల్లో ఖర్చులు అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ఆదాయాన్ని (Income) కూడా మెరుగుపరచుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కొత్త ఏడాది 2023లోకి అడుగు పెట్టిన నేపథ్యంలో చాలామంది కొంగొత్త ఆర్థిక తీర్మాణాలను (Financial resolution) రూపొందించుకున్నారు. అలాంటివారు అదనపు ఆదాయ మార్గాలు అన్వేషించక తప్పదు. మరి అలాంటివారికి ఉపయోగపడే మార్గాలు ఉన్నాయి.. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం..

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి..

ఆర్థిక వ్యవస్థలో పరిస్థితుల దృష్ట్యా వడ్డీ రేట్లు (Interest rates) తక్కువగా ఉన్న నేపథ్యంలో 2023లో మనీ ఇన్వెస్ట్‌మెంట్‌కు (Money Investment) సంబంధించి స్టాక్ మార్కెట్ (Stock market) కూడా ఒక చక్కటి మార్గం. మార్కెట్లు ఈ ఏడాది కూడా లాభాల బాటలో పయణించొచ్చని, సంపద వృద్ధికి (Wealth growth) స్టాక్ మార్కెట్ చక్కటి అవకాశమని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడుల విషయంలో సొంతంగా స్టాక్స్ అన్వేషణ చేయాలి. వృద్ధి, స్థిరత్వం విషయంలో మంచి ట్రాక్ రికార్డ్ కలిగివున్న కంపెనీలను ఎంపిక చేసుకోవడం ఉత్తమం. ఎలాంటి అవగాహన లేకుంటే నిపుణులను సంప్రదించడం అత్యుత్తమం.

సొంతంగా సైడ్ బిజినెస్...

ఆర్థిక వ్యవస్థలో పరిస్థితులు సానుకూలంగానే ఉండడంతో సొంతంగా డబ్బు సంపాదనపై దృష్టిపెట్టడం ఒక చక్కటి మార్గం. ఇందుకోసం సొంతంగా సైడ్ బిజినెస్ లేదా ఇష్టమైన ఫీల్డ్‌లో ఫ్రీలాన్సింగ్ మొదలుపెట్టడం లాభదాయకం. పెంపుడు జంతుల సంరక్షణ నుంచి గ్రాఫిక్ డిజైన్ వరకు ఇష్టమైనదేదైనా చేయవచ్చు. ప్రస్తుతం చక్కటి ఆదరణ ఉన్న ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌ను కూడా పరిశీలించవచ్చు.

రూమ్స్ ఖాళ్లీగా ఉంటే అద్దెకు ఇవ్వండి..

మీ ఇంట్లో రూమ్స్ ఏమైనా ఖాళ్లీగా ఉంటే అద్దెకు ఇచ్చే విషయాన్ని పరిశీలించండి. ఎయిర్‌బీఎన్‌బీ (Airbnb) లేదా వీఆర్‌బీవో (Vrbo) వంటి ప్లాట్‌ఫామ్స్‌పై వీటిని అందుబాటులో ఉంచవచ్చు. ముఖ్యంగా పర్యాటక ప్రదేశాలకు దగ్గరగా ఉండేవారికి చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. స్థానిక చట్టాలు , నిబంధనలను తెలుసుకుని గదులను అద్దెకు ఇవ్వడం ఆదాయానికి చక్కటి మార్గం.

ఉపయోగంలేని వస్తువులు అమ్మేయండి..

అంతగా అవసరంలేని వస్తువులను విక్రయించడం ద్వారా కొంతమేర ఆదాయాన్ని పొందొచ్చు. అమెజాన్ (Amazon), ఇట్సీ (Etsy) వంటి ఆన్‌లైన్ మార్కెట్ ప్లాట్‌ఫామ్స్ పెరిగిపోవడంతో వస్తువులు అమ్మేయడం చాలా సులభమైపోయింది. ధరించని దుస్తులు, బూట్లు, ఫర్నీచర్, ఎలక్ట్రానిక్స్, హస్తకళా వస్తువులను కూడా ఆన్‌లైన్‌లో విక్రయించవచ్చు.

మనీ సేవింగ్ మార్గాలు వెతకండి..

అదనపు డబ్బు అన్వేషణ మార్గాల్లో డబ్బు పొదుపు (Money saving) కూడా చాలాముఖ్యమైనది. బయట తినడం లేదా సబ్‌స్ర్కిప్షన్ వంటి అనవసర వ్యయాలను కట్ చేసుకోవడం మంచిది. ఇన్సూరెన్స్, కేబుల్ కోసం తక్కువ రేటుతో ఉండేవాటిని కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడంలో ఇవన్నీ కొంతోకొంత ఉపయోగపడేవే.

బ్లాగ్ లేదా యూట్యూబ్ ఛానల్ ప్రారంభం..

సోషల్ మీడియా, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ వినియోగం పెరిగిపోయిన నేపథ్యంలో బ్లాగ్ లేదా యూట్యాబ్ ఛానల్ ప్రారంభించి డబ్బు సంపాదించడం చాలా సులభంగా మారిపోయింది. విలువైన కంటెంట్‌ అందిస్తే ఆడియన్స్ చక్కగా ఆదరిస్తున్నారు. ప్లాట్‌ఫామ్ మోనిటైజేషన్ తర్వాత ఆదాయాన్ని పొందొచ్చు. కాబట్టి 2023లో సరైన ప్రణాళికతో ముందుకెళ్తే అదనపు ఆదాయాన్ని పొందొచ్చు.

ఆన్‌లైన్ సర్వేలు, పేయిడ్ రీసెర్చ్‌లో పాల్గొనండి..

రీసెర్చ్ కంపెనీలు తమ సర్వేలు, అధ్యయనాల్లో పాల్గొనేవారి కోసం ఎదురుచూస్తుంటాయి. వీటిల్లో పాల్గొనడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. కంపెనీలు తమ ఉత్పత్తులు, సర్వీసులను మెరుగుపరచుకునేందుకు సర్వేలు, అధ్యయనాలను ఉపయోగించుకుంటుంటాయి.

Updated Date - 2023-01-22T21:14:16+05:30 IST