Budget2023: బడ్జెట్‌పై ఉద్యోగుల గంపెడాశలు! కోరికలు ఇవే..

ABN , First Publish Date - 2023-01-11T16:59:03+05:30 IST

మరో 20 రోజుల్లో పార్లమెంట్ ముందుకు రానున్న కేంద్ర బడ్జెట్ 2023పై (Central Budget2023) వేతన జీవులు (Salaried Classes) ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఆదాయ పన్ను భారం తగ్గింపు (Income Tax Burden) సహా పలు ఉపశమన చర్యలను కోరుకుంటున్నారు.

Budget2023: బడ్జెట్‌పై ఉద్యోగుల గంపెడాశలు! కోరికలు ఇవే..

న్యూఢిల్లీ: మరో 20 రోజుల్లో పార్లమెంట్ ముందుకు రానున్న కేంద్ర బడ్జెట్ 2023పై (Central Budget2023) వేతన జీవులు (Salaried Classes) ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఆదాయ పన్ను భారం తగ్గింపు (Income Tax Burden) సహా పలు ఉపశమన చర్యలను కోరుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం గత ఐదేళ్లుగా ప్రధాన సంస్కరణలేవీ చేపట్టకపోవడంతో నిర్మలమ్మ ఈ బడ్జెట్‌లోనైనా కరణిస్తారా అని ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఎంతోకాలంగా పెండింగ్‌లోనే ఉన్న ఆదాయ పన్ను హేతుబద్ధీకరణ (Income tax rationalisation) డిమాండ్‌ను ఈ బడ్జెట్‌లో నెరవేర్చాలని ఆశిస్తున్నారు. ఐచ్ఛిక ఆదాయ పన్ను విధానం (Optional Income tax regime) అమల్లో ఉన్నప్పటికీ అంత ప్రయోజనకరంగా లేదని వేతనజీవులు అభిప్రాయపడుతున్నారు. కనిష్ఠ పన్ను రేటు స్లాబులు లేదా ఆకర్షణీయ నూతన ఆదాయ పన్ను విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నారు. మరోవైపు ప్రస్తుతం రూ.50 వేలుగా ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

ట్యాక్స్ రిలీఫ్ లేనట్టేనా?

కరోనా మహమ్మారి (Corona Pandamic), ద్రవ్యోల్బణం (Inflation) పెరుగుదల ప్రభావంతో ఆదాయ వృద్ధి మందగించిన నేపథ్యంలో వేతన వర్గాల డిమాండ్లు న్యాయబద్ధమైనవేనని నిపుణులు చెబుతున్నాయి. అయితే రానున్న బడ్జెట్ 2023పై మరీ ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదని సూచిస్తున్నారు. అంతర్జాతీయంగా దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక సంవత్సరం -2024లో జీడీపీ వృద్ధి రేటు (GDP Growth Rate) తగ్గొచ్చనే అంచనాల నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం కఠిన పరిస్థితులను చవిచూడాల్సి రావొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరి దేశంలోని చెల్లింపుదారుల్లో అతిపెద్ద గ్రూపుగా ఉన్న ఉద్యోగ వర్గాల ఆశలు బడ్జెట్ 2023లో ఎంతవరకు నెరవేరతాయో వేచిచూడాలి.

దీర్ఘకాల వృద్ధిపై ఫోకస్..

వచ్చే ఏడాది 2024లో సార్వత్రిక ఎన్నికలు (General Elections) జరగనున్నప్పటికీ ప్రభుత్వం దీర్ఘకాల వృద్ధికే ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక నిర్వహణలో విచక్షిణ పాటిస్తూనే వృద్ధికి బాటలు వేయెచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక ఏకీకరణ దిశగా అడుగులు పడే అవకాశం ఉందని డీబీఎస్ మేనేజింగ్ డైరెక్టర్‌ తైమూర్ బైగ్ అంచనా వేశారు. మౌలిక వసతుల అభివృద్ధికే అధిక వ్యయాలు కేటాయించే అవకాశం ఉందని, ఉపాధి కల్పనతోపాటు వృద్ధికి అవకాశం ఉండడమే ఇందుకు కారణంగా ఉంది.

Updated Date - 2023-01-11T17:04:45+05:30 IST