Nita Ambani: రిలయన్స్ బోర్డుకు నీతా అంబానీ రాజీనామా! బోర్డులోకి అంబానీ సంతానం

ABN , First Publish Date - 2023-08-28T18:03:02+05:30 IST

వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కంపెనీ 46వ వార్షిక సమావేశాల్లో ప్రకటించారు.

Nita Ambani: రిలయన్స్ బోర్డుకు నీతా అంబానీ రాజీనామా! బోర్డులోకి అంబానీ సంతానం

వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కంపెనీ 46వ వార్షిక సమావేశాల్లో ప్రకటించారు. కాగా నీతా అంబానీ బోర్డులో ఇంత కాలం డైరెక్టర్‌గా ఉన్నారు. ఆమె రాజీనామాను బోర్డు డైరెక్టర్లు కూడా అంగీకరించారు. అయితే నీతా అంబానీ బోర్డు నుంచి తప్పుకున్నప్పటికీ కంపెనీ అన్ని బోర్డు సమావేశాలకు హాజరవుతారు. మరోవైపు నీతా అంబానీ తప్పుకున్నప్పటికీ ఆమె పిల్లలు బోర్డులోకి అడుగుపెట్టారు. అంబానీ సంతానం ఇషా, ఆకాష్, అనంత్ ముగ్గురు కూడా బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమితులయ్యారు. నిజానికి కొంతకాలంగా ఈ ముగ్గురు కంపెనీకి సంబంధించిన పలు వ్యాపారాలను చూసుకుంటున్నారు. రిటైల్, డిజిటల్ సర్వీసులు, ఎనర్జీ రంగాలకు చెందిన వ్యాపారాలను చూసుకుంటున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించారు.


వైఫై(Wifi) వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జియో ఎయిర్ ఫైబర్‌(Jio AirFiber) ప్రారంభ తేదీని ఏజీఎమ్ 2023( AGM 2023) వార్షిక సమావేశాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ( Mukesh Ambani) అధికారికంగా ప్రకటించారు. దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 19 నుంచి జియో ఎయిర్ ఫైబర్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా 5జీ హాట్‌స్పాటైనా జియో ఎయిర్ ఫైబర్‌ను గత ఏజీఎమ్ వార్షిక సమావేశాల్లోనే ప్రకటించారు. కానీ అది ఎప్పటి నుంచి అందుబాటులో ఉండేది అప్పుడు వెల్లడించలేదు. తాజాగా 46వ ఏజీఎమ్ వార్షిక సమావేశాల్లో భాగంగా సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభించనున్నట్లు అంబానీ తెలిపారు. జియో ఎయిర్ ఫైబర్‌ లాంచ్ అయ్యాక అన్ని రిలయన్స్ అవుట్‌లెట్లలో అందుబాటులో ఉంటుందని ఆయన చెప్పారు. కాగా జియో ఎయిర్ ఫైబర్‌కు ఎటువంటి కేబుల్ అవసరం ఉండకపోవడంతో వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Updated Date - 2023-08-28T18:06:28+05:30 IST