Axis Bank: మీకు యాక్సిస్ బ్యాంక్‌లో ఖాతా ఉందా..? కస్టమర్లకు పండగలాంటి వార్త..!

ABN , First Publish Date - 2023-02-11T19:18:16+05:30 IST

రెపో రేటును 0.25 శాతం పెంచుతున్నట్లు ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. 2022 డిసెంబర్‌ 7న 6.25% గా ఉన్న రెపో రేటును 6.50% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల బ్యాంకు రుణాలపై వడ్డీ రేటు..

Axis Bank: మీకు యాక్సిస్ బ్యాంక్‌లో ఖాతా ఉందా..? కస్టమర్లకు పండగలాంటి వార్త..!

రెపో రేటును 0.25 శాతం పెంచుతున్నట్లు ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) ప్రకటించింది. 2022 డిసెంబర్‌ 7న 6.25% గా ఉన్న రెపో రేటును 6.50% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల బ్యాంకు రుణాలపై వడ్డీ రేటు (Interest rate on bank loans) పెరగడంతో పాటూ, బ్యాంకు డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లు పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్.. తమ ఖాతాదారులకు (Axis Bank customers) శుభవార్త చెప్పింది. రూ.2కోట్ల లోపు ఎఫ్‌డీలు ఉన్న ఖాతాదారులకు ప్రయోజనం చేకూరనుంది. వివరాల్లోకి వెళితే..

యాక్సిస్ బ్యాంక్ (Axis Bank).. తమ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. రూ.2కోట్ల లోపు ఎఫ్‌డీలపై (FD) వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన కొత్త రేట్లు 2023 ఫిబ్రవరి 11నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ప్రస్తుతం ఈ బ్యాంకు 7రోజుల నుంచి 10ఏళ్లలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 3.50% నుండి 7.00% వడ్డీ రేటును అందిస్తోంది. అదేవిధంగా సీనియర్ సిటిజన్‌లకు 6.00% నుంచి 7.75% వరకు వడ్డీ రేటు అందిస్తోంది. కాగా, కొత్త ఎఫ్‌డీ రేట్ల ప్రకారం.. 7 రోజుల నుండి 45 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 3.50 శాతం వడ్డీ రేటును అందించనుంది.

బ్యాంకు లాకర్లో కరెన్సీ నోట్ల కట్టలు.. తీసుకుందామని వెళ్లిన కస్టమర్.. తాళం తీసి చూడగానే కనిపించిన సీన్ చూసి..!

Reserve-Bank-of-India.jpg

అదేవిధంగా 46 రోజుల నుండి 60 రోజులలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 4% వడ్డీని చెల్లిస్తుంది. అలాగే 61 రోజుల నుంచి 3 నెలల వ్యవధిలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 4.50 శాతం వడ్డీ రేటు అందించనుంది. ప్రస్తుతం 3 నెలల నుంచి 6 నెలల వ్యవధిలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 5.75 శాతం వడ్డీ రేటు ఇవ్వబడుతుంది. 6 నెలల నుంచి 9 నెలల వ్యవధిలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 6 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. 9 నెలల నుండి ఏడాదిలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 6% వడ్డీ రేటు అందుబాటులో ఉంది.

Viral Video: హాయిగా పడుకుందామని బెడ్ వద్దకు వెళ్లాడు.. అనుమానం రావడంతో.. పరుపు ఎత్తి చూసి ఖంగుతిన్నాడు..

Updated Date - 2023-02-11T19:24:49+05:30 IST