YuvaGalam : లోకేష్ ‘యువగళం’ ను అడ్డుకునేందుకు వైసీపీ ప్లాన్.. రంగంలోకి దిగిన కేశినేని చిన్ని..!

ABN , First Publish Date - 2023-08-14T19:22:41+05:30 IST

టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రకు (YuvaGalam Padayatra) మొదటి రోజు నుంచి ఇవాళ్టి 183వ రోజు వరకూ ఎలాంటి ఆదరణ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఈ ఆదరణను అధికార వైసీపీ (YSR Congress) జీర్ణించుకోలేకపోతోంది..

YuvaGalam : లోకేష్ ‘యువగళం’ ను అడ్డుకునేందుకు వైసీపీ ప్లాన్.. రంగంలోకి దిగిన కేశినేని చిన్ని..!

టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రకు (YuvaGalam Padayatra) మొదటి రోజు నుంచి ఇవాళ్టి 183వ రోజు వరకూ ఎలాంటి ఆదరణ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఈ ఆదరణను అధికార వైసీపీ (YSR Congress) జీర్ణించుకోలేకపోతోంది. మొదటి రోజు నుంచే అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ వస్తోంది సర్కార్. సభల్లో మాట్లాడటానికి కనీసం మైక్ కూడా అనుమతించకపోవడం.. నిల్చోవడానికి బల్ల కూడా ఇవ్వకుండా ఇలా ఒకటా రెండా చెప్పుకుంటే పోతే పలు రకాలుగా ఏపీ పోలీస్ యంత్రాంగం ఓవారక్షన్ చేసిందనే ఆరోపణలు కోకొల్లలు. అయితే.. ప్రస్తుతం తాడికొండ నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర దిగ్విజయంగా సాగుతోంది. ఇక్కడ పూర్తవ్వగానే బెజవాడలో యువగళం పాదయాత్ర ప్రారంభం కానుంది.


Nara-Lokesh.jpg

బరితెగించి.. బెదిరించి..!

బెజవాడలో (Bezawada) ఎట్టి పరిస్థితుల్లో యువగళం జరగకుండా ఉండాలని.. ఎలాగైనా సరే ఆపాలని వైసీపీ కుయుక్తులు పన్నుతోంది. తూర్పు నియోజకవర్గంలో లోకేష్ సభ నిర్వహణకు స్ధలం ఇవ్వొద్దని వైసీపీ హుకుం జారీ చేసింది. యువగళం సభలకు స్థలాలు, ఫంక్షన్ హాల్స్ ఇచ్చేవారికి వైసీపీ నేతలు నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ఈ మధ్యనే టీడీపీ నేతలు పరిశీలించిన స్ధల యజమానికి వైసీపీ పెద్దల నుంచి వరుస ఫోన్లు వెళ్లాయి. ఫోన్‌లో బెదిరించి, బరితెగించి మరీ మాట్లాడటం గమనార్హం. సభలు, యాత్రకు స్థలాలు, ఫంక్షన్ హాల్స్ ఇస్తే ఇబ్బందులు తప్పవని నేతలకు వార్నింగ్ కూడా ఇచ్చారు వైసీపీ నేతలు. అసలు తూర్పు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర లేకుండానే చేయాలన్నది వైసీపీ యువనేత దేవినేని అవినాష్ (Devineni Avinash) ప్లాన్ చేస్తున్నట్లు తెలియవచ్చింది. ఒకవేళ ఇబ్బందులు అధిగమించి పాదయాత్ర చేస్తే మాత్రం.. ఆటంకాలు సృష్టించేందుకు కూడా ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వైసీపీ నేతల (YSRCP Leaders) నుంచి వరుసగా ఫోన్లు వస్తుండటంతో బెంబేలెత్తిన స్ధల యజమాని.. అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. అన్ని నియోజకవర్గాల్లో యాత్ర చేపట్టిన తమ అభిమాన నేత.. తూర్పు నియోజకవర్గంలోకి వస్తారా.. రారో అని టీడీపీ వీరాభిమానులు, కార్యకర్తలు కంగారు పడుతున్నారట.

Kesineni-Chinni.jpg

రంగంలోకి చిన్ని..!

టీడీపీ శ్రేణుల నుంచి ఈ విషయాలన్నీ తెలుసుకున్న ఆ పార్టీ నేత కేశినేని చిన్ని (Kesineni Chinni) (ఎంపీ కేశినేని నాని సోదరుడు) రంగంలోకి దిగిపోయారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. తూర్పు నియోజకవర్గంలో లోకేష్ బహిరంగసభ జరిగి తీరుతుందని చిన్ని తేల్చిచెప్పారు. సభ విషయంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని.. టీడీపీ శ్రేణులు ఆందోళన చెందొద్దని ఆయన భరోసా ఇచ్చారు. లోకేష్ సభను ఎవరూ అడ్డుకోలేరని.. అడ్డుకుందామంటే అది పగటి కలే అవుతుందని సున్నితంగానే వైసీపీ నేతలను కేశినేని చిన్ని హెచ్చరించారు. ‘మనల్ని ఎవడ్రా ఆపేది.. ఏం జరిగినా సరే చూస్కుందాం’ అన్నట్లుగా చిన్ని ధీమాగా చెప్పడంతో తూర్పు నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. కాగా.. గత కొన్నిరోజులుగా లోకేష్ పాదయాత్రలో, టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గాల పర్యటనలో ఊహించని ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అకారణంగా వైసీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడటం, బరితెగించి దాడులు చేయడం లాంటి ఘటనలు జరుగుతున్న విషయం తెలిసిందే.

Kesineni-Chinni-And-Chandra.jpg

తాడికొండలో జనసంద్రం!

ఇదిలా ఉంటే.. తాడికొండలో నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర జనప్రభంజనంగా మారింది. పట్టణంలో సాగుతున్న పాదయాత్ర జనసంద్రాన్ని తలపిస్తోంది. యువనేతకు వేలాదిమంది మహిళలు, యువకులు రోడ్లపైకి వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. దారిదొడవునా పూలతివాచీతో యువనేతకు జనం నీరాజనాలు పడుతున్నారు. అమరావతి రాజధాని గ్రామాలనుంచి వేలాదిగా ప్రజలు, రైతులు తరలివచ్చారు. ప్రస్తుతం తాడికొండలో ఎటుచూసినా జనప్రభభంజనమే ఉండటంతో ప్రధాని రహదారి కిటకిటలాడుతున్నది. భారీ గజమాలలతో ప్రజలు, టీడీపీ కార్యకర్తలు స్వాగతం పలికారు. మరోవైపు తమ ఊరొచ్చిన యువనేతను చూసేందుకు భవనాలపైకి ఎక్కారు జనం. స్థానికంగా ఉన్న యువకులు, ప్రజలు.. యువనేతను కలిసి సమస్యలు చెప్పుకుంటున్నారు. యువనేతతో కరచాలనం చేసేందుకు యువకులు, విద్యార్థులు పోటీపడుతున్నారు.

lokesh-ananta-5.jpg


ఇవి కూడా చదవండి


Breaking News : ఎంపీ అసదుద్దీన్ ఇంటిపై ఆగంతకుల దాడి.. ఇదే ఘటన బీజేపీ నేతకు జరిగి ఉంటే..!?


Chandrababu : హిమాచల్ పర్యటనలో బిజిబిజీగా చంద్రబాబు.. గవర్నర్ దత్తన్నతో భేటీ


Punganur Incident : పుంగనూరు ఘటనలో టీడీపీ కీలక నేతలకు బిగ్ రిలీఫ్..


Updated Date - 2023-08-14T19:28:55+05:30 IST